SAKSHITHA NEWS

అన్నదానం మహాదానం…
యువత ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాలుపంచుకోవడం సంతోషం: నీలం మధు ముదిరాజ్
గణనాథుడి మండపాల వద్ద ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాలకు హాజరై గణనాథులను దర్శించుకున్న నీలం మధు..
ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు..

అన్ని దానాలలోకెళ్ల అన్నదానం మహాదానమని నీలం మధు ముదిరాజ్ అన్నారు.
శుక్రవారం పటాన్చెరు మండలం బచ్చుగూడ, రామేశ్వరం బండ, భానూర్ గ్రామాలలో వినాయక మండపాల వద్ద ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.


వినాయక మండపాలలో గణనాధులకు ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వినాయక మండపాల నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి సత్కరించారు.
అనంతరం నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ యువత ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆధ్యాత్మిక భావంతో మానసిక శక్తి సిద్ధించడంతోపాటు సేవా దృక్పథం అలవడుతుందని గ్రామాలలో స్నేహపూర్వక వాతావరణం నెలకొంటుందన్నారు. వినాయక చవితి నవరాత్రులు ప్రతి ఒక్కరూ భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ లోక క్షేమం కోసం పూజలు అన్నదానాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఆ గణనాథుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని ఆకాంక్షించారు.


యువత సామాజిక అవగాహన కలిగి ఉండాలని యువత తలుచుకుంటే సాధించలేనిదెం లేదన్నారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో యువత సరైన నాయకుడికి మద్దతు తెలిపి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. యువత ముందడుగు వేస్తే విజయమే తప్ప అపజయము అనే మాట ఉండబోదని వెల్లడించారు.
యువతకు తన సంపూర్ణ సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భక్తులు,ప్రజలు,స్థానిక నాయకులు, NMR యువసేన సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 09 22 at 12.08.52 PM

SAKSHITHA NEWS