గుండెపోటుతో మలయాళీ యువనటి మృతి

Spread the love

మలయాళీ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. యువ నటి లక్ష్మిక సజీవన్ (27) గుండెపోటుతో మృతి చెందింది. రాత్రి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‏లోని షార్జాలో లక్ష్మిక తుదిశ్వాస విడిచారు.

కేరళలోని పల్లురుతి కచేరిపడి వాజవేలి ప్రాంతానికి చెందిన లక్ష్మీక షార్జాలోని ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నారు. చిన్న వయసులోనే లక్ష్మీక గుండెపోటుతో మృతి చెందడం సినీ పరిశ్రమకు షాక్‏కు గురి చేసింది.

కాక్క’ అనే షార్ట్ ఫిల్మ్‏లో పంచమిగా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇందులో.. తన రంగు కారణంగా కుటుంబం ఆమెను తిరస్కరించడం.. తన లోపాన్ని చూసి ఆత్మ స్థైర్యంతో జీవితాన్ని గెలిచిన అమ్మాయి కథే ‘కాక్క, ఇందులో తన నటన తో ప్రశంసలు అందుకుంది లక్ష్మిక. ఆ తర్వాత ఆమె కొన్ని చిత్రాల్లో నటించింది.

సౌదీ వెల్లక్కా..పంచ వర్ణతతా..పూజ యమ్మ.. ఉయారే.. ఒరు కుట్టనాథక్ బ్లాక్, నిత్యహరిత నాయగన్ వంటి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు.అలాగే స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా చేసిన ఒరు యమనందాన్ ప్రేమ కథలోనూ లక్ష్మీక నటించింది.

ఆమె చివరిసారిగా 2021లో కూన్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమాకు ప్రశాంత్ మొలికల్ దర్శకత్వం వహించారు. లక్ష్మిక సజీవన్ మరణవార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page