తాడేపల్లిలో సిపిఎం – సిపిఐ ప్రచార భేరి ప్రారంభ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు.
రాష్ట్రలో ఉన్న వైసీపీ, టీడీపీ, జనసేన, బిజెపికి షాడో పార్టీలుగా పనిచేస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు అన్నారు. తాడేపల్లి పట్టణంలోని నులకపేట రామయ్య కాలనీ లో సిపిఎం – సిపిఐ, ప్రచార భేరి కార్యక్రమం ప్రారంభం సందర్భంగా వేముల దుర్గారావు అధ్యక్షతన జరిగిన సభలో శ్రీనివాసరావు పాల్గొని ప్రసంగించారు.కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన అనంతరం నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు విపరీతంగా పెరిగాయని అన్నారు.సంవత్సరానికి కోటి ఉద్యోగాలు ఇవ్వకపోగ ఉన్న ఉద్యోగస్తులనుతొలగిస్తున్నారని,మరోవైపు నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోందని అన్నారు.
బ్యాంకులను మోసం చేసిన పెద్ద పెద్ద అవినీతి పరులు బిజెపిలో చేరి రాజకీయ నాయకులగా చలామణి అవుతున్నారని విమర్శించారు.ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ చేసి వాళ్లకు అనుకూలంగా ఉన్న గుజరాతీ కార్పోరేటర్లకు కట్టబెడుతోందని అన్నారు.దేశంలో పండగల పేరుతో మత ఘర్షణలు సృష్టిస్తున్న బిజెపి,ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంస్థల ఎడల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. 2019 లో పుల్వామా ఘటన సందర్భంగా 40 మంది జవాన్లు మృతికి కారణమైన ప్రధాని మోడీ దేశానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.దేశ భక్తి ముసుగులో దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మోడీ ఒక్క క్షణం కూడా ఆ పదవిలో ఉండే అర్హత లేదని విమర్శించారు. రాజధాని అమరావతి విషయంలో మోడీ ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లిన ప్రతి సందర్భంలోను ప్రజలపై భారాలు పడుతున్నాయని అన్నారు.ఢిల్లీ వెళుతున్న జగన్ రాష్ట్రానికి రావాల్సిన నిధుల, హమీల అమలు కోసం కాకుండా కేసుల గురించి వెళ్తున్నట్లు ఉందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర బిజెపి ప్రభుత్వం చెప్పినట్టు నడుచుకుంటూ ప్రజలపై విద్యుత్ చార్జీలు, ఆస్తి పన్ను, చెత్త పన్ను రూపంలో భారాలు మోపిందని అన్నారు.సంక్షేమ పథకాలు పేరుతో ప్రజలపై భారాలు మోపుతున్న రాష్ట్ర ప్రభుత్వం నిలదీయాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నికరంగా పోరాటాలు చేస్తున్న వామపక్ష పార్టీలను ప్రజలు ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. 40 సంవత్సరాలుగా నులకపేట ఫారెస్ట్ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, ఢీ ఫారెస్టు చేసి అందరికీ పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సిపిఐ నియోజకవర్గ సహయ కార్యదర్శి కంచర్ల కాశయ్య, సిపిఎం పట్టణ కార్యదర్శి బూరుగ వెంకటేశ్వర్లు, నాయకులు దొంతిరెడ్డి శ్రీనివాసకుమారి, కొట్టె కరుణాకరరావు, గాదె సుబ్బారెడ్డి, సోలా ముత్యాలరావు, శౌరి బర్తులం, దొంతిరెడ్డి విజయ భాస్కర్ రెడ్డి, యనమాల బర్న బాస్, నీరుడు దుర్గారావు, ఏషియా, తులసమ్మ, లక్ష్మి, వెంకన్న, కట్టా మేరీ మరియు సిపిఐ, నాయకులు మానికొండ డాంగే, తుడిమెల వెంకటయ్య,మునగాల రామారావు, అనిల్
తదితరులు పాల్గొన్నారు. అనంతరం ప్రచార భేరి నులకపేట వివిధ ప్రాంతాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం విధానాలనపై ముద్రించిన కరపత్రాలను విరివిగా పంపిణీ చేశారు.