SAKSHITHA NEWS

వరల్డ్‌ ఆర్గాన్‌ డొనేషన్‌ డే 2022

2022 ఆగస్టు 13 – ప్రపంచ అవయవ దాన దినోత్సవం

అవయవ దానం యొక్క ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి మరియు మరణానంతరం అవయవాలను దానం చేయడానికి ప్రజలను ప్రేరేపించడానికి ప్రతి సంవత్సరం ఆగస్టు 13న ప్రపంచ అవయవ దాన దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఒక అవయవ దాత ఎనిమిది మంది జీవితాలను కాపాడగలడు కాబట్టి, అవయవ దానం అనేది చాలా ప్రాముఖ్యం కలిగివున్నది.

దాత యొక్క గుండె, కాలేయం, మూత్రపిండాలు, ప్రేగులు, ఊపిరితిత్తులు మరియు క్లోమం (ప్యాంక్రియస్‌) వంటి అవయవాన్ని దాత మరణించిన తర్వాత శరీరం నుండి సేకరించడం, అవయవ అవసరం ఉన్న మరొక వ్యక్తికి ఆ అవయవాన్ని మార్పిడి చేయడాన్ని అవయవ దానం అంటారు. పలు నివేదికల ప్రకారం, 5000 కిడ్నీలు, 1000 కాలేయాలు మరియు దాదాపు 50 గుండెల సంఖ్యతో భారతదేశంలో ఏటేటా అవయవ మార్పిడి చేయించుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. అయితే, భారతదేశంలో ప్రస్తుత అవయవ దానం రేటు చాలా తక్కువగా ఉన్నది – స్పెయిన్‌లో ఒక మిలియన్‌కు 46.9 మరియు అమెరికాలో 31.96 లతో పోల్చినప్పుడు భారతదేశంలో మిలియన్‌కు కేవలం 0.86  రేటు మాత్రమే ఉన్నది, భారతదేశంలో ప్రతి మిలియన్‌కు అవయవ దానం రేటు 1కి  చేరుకుంటే కనుక అవయవాల కోసం ప్రస్తుత డిమాండ్‌లను అది దాదాపు తీర్చగలదు.

అవయవ దానం ఎవరు చేయవచ్చు?

వయస్సు, ఆరోగ్యం మరియు జాతితో సంబంధం లేకుండా ప్రజలందరూ తమను తాము సాధ్యమైన అవయవ మరియు కణజాల (టిష్యూ) దాతలుగా మార్చుకోవచ్చు. మరణం తరువాత దాతగా ఉండడానికి ఏ వ్యక్తి కూడా చాలా పెద్దవాడు లేదా చాలా చిన్నవాడు అనే బేధం లేదు. నవజాత శిశువులు మొదలుకుని 90 ఏళ్లలోపు వయస్సున్న సీనియర్‌ సిటిజన్లు వరకు కూడా అవయవ దాతలుగా వుండవచ్చు, ఇందులో అవయవ ఆరోగ్యం అనేది వయస్సు కంటే చాలా ముఖ్యమైనది. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి కూడా తాను మరణించిన తర్వాత అవయవాలు లేదా కణజాలాలను దానం చేయవచ్చు,  వైద్యులు అవయవాలను పరిశీలించి, అవి దానం చేయడానికి సరిపోతాయో లేదో అని నిర్ణయిస్తారు. అయితే, క్యాన్సర్‌ లేదా మరే ఏ ఇతర ఇన్‌ఫెక్షన్‌ శరీరంలోని అన్ని అవయవాలకు సంక్రమించినట్లయితే ఆ కారణంగా మరణించిన వారు దాతగా మారేందుకు వీలుపడదు.

అవయవ దానంపై కోవిడ్‌-19 ప్రభావం

అవయవ దానం మరియు అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు మరియు దాతల అవసరాన్ని కోవిడ్‌-19 మహమ్మారి పూర్తిగా నిలిపివేసింది, కరోనా వైరస్‌ వ్యాధి చికిత్సకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ మరియు అవయవ మార్పిడి అవసరమైన రోగులను అది తీవ్రంగా ప్రభావితం చేసింది. కోవిడ్‌-19 వ్యాప్తిని నివారించే చర్యగా లాక్‌డౌన్‌ సమయంలో అవయవ మార్పిడి కార్యక్రమ్యాన్ని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది.

కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా మూత్రపిండాలు, కాలేయం, గుండె మరియు ఊపిరితిత్తుల వైఫల్యం వంటి చివరి దశ వ్యాధులతో బాధపడుతున్న రోగులు ఆందోళన చెందుతున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్‌ రోగులు కోవిడ్‌-19 బారిన పడే ప్రమాదం కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, నిరంతర డయాలసిస్‌తో వారి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. అయితే, కాలేయం, గుండె లేదా ఊపిరితిత్తుల వ్యాధి విఫలమైన రోగులకు ఆశాకిరణంగా ఉండే అవయవ మార్పిడి ఇప్పుడు ఒక ప్రశ్నగా నిలుస్తున్నది. కోవిడ్‌-19 ప్రభావంతో అవయవ మార్పిడి ఆలస్యం చేయడం ఇప్పుడు ఒక పెద్ద విపత్తుగా మారింది.

అవయవ మార్పిడి రోగులకు కోవిడ్‌-19 ప్రమాదం ఎక్కువగా ఉందా?

గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ ఐ బ్యాంకింగ్‌ (జిఎఇబి) ప్రకారం, సార్స్‌ కోవిడ్‌-2 వైరస్‌లు రక్త మార్పిడి లేదా కణజాల (టిష్యూ) మార్పిడి ద్వారా సంక్రమించవచ్చని ప్రస్తుతానికి అయితే ఎటువంటి ఆధారాలు లేవు. అవయవ మార్పిడితో వైరస్‌ వ్యాప్తిపై ఇప్పటి వరకు ఎటువంటి నివేదికలు లేనప్పటికీ, కిడ్నీపై కరోనా వైరస్‌ ఎక్కువ ప్రభావం కలిగి ఉన్నదని తేలింది, దాదాపు 30% మంది రోగులలో అది పునరావృతమవుతున్నదని తేలింది. కార్నియా మార్పిడి గ్రహీతలకు సంబంధించి, ఎటువంటి ప్రమాదం లేదు, ఎందుకంటే కార్నియా తిరస్కరణను నివారించడానికి వారి రోగనిరోధక శక్తిని తగ్గించడానికి వారికి బ్లడ్‌ గ్రూప్‌ మ్యాచింగ్‌ లేదా నోటి మందులు అవసరం లేదు.

అవయవ మార్పిడి గ్రహీతలకు స్పష్టంగా చెప్పాలంటే మొదటి 3 నెలల కాలంపాటు రోగనిరోధక శక్తిని అణిచివేసే అధిక మోతాదు మందులు మరియు జీవితకాలం పాటు తక్కువ మోతాదు మందులు అవసరం. అవయవ మార్పిడి రోగికి సోకడానికి అవసరమైన కోవిడ్‌-19 యొక్క వ్యాప్తి పరిమాణం తక్కువగా ఉన్నా అది ప్రాణాంతక న్యుమోనియాకు దారితీయవచ్చు.

ఇండియన్‌ సొసైటీ ఆఫ్‌ ఆర్గాన్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ (ఐఎస్‌ఒటి) కరోనా వైరస్‌ కాలంలో జీవించివున్న వ్యక్తి నుండి మూత్రపిండాల మార్పిడిని ఆలస్యం చేయడం ఉత్తమం అని సూచించవచ్చు. అయినప్పటికీ, కాలేయ వైఫల్యం యొక్క తీవ్రమైన ప్రాణాంతక రూపాలు ఉన్న రోగులలో లివింగ్‌ డోనర్‌ లివర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ పరిగణనలోకి తీసుకోవచ్చు.

అవయవ దానం ద్వారా చనిపోయిన వ్యక్తి నుండి సేకరించిన గుండె, ఊపిరితిత్తులు, కాలేయం మరియు మూత్రపిండాల మార్పిడిని ఆసుపత్రులలో చికిత్స పొందే కోవిడ్‌-19 రోగుల దశ మరియు సంఖ్యను బట్టి కొనసాగించవచ్చు.

అవయవ దాత 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే, వారు అవయవ దాతగా పేరు నమోదు చేసుకోవడానికి వారి తల్లిదండ్రులు లేదా వారి సంరక్షకులు సమ్మతిని తెలియ చేయాల్సి ఉంటుంది. 1954లో రోనాల్డ్‌ లీ హెరిక్‌ తన లాంటి కవల సోదరుడికి కిడ్నీని దానం చేయడంతో తొలిసారిగా ఈ అవయవ దానం అనేది ప్రారంభమైంది.

అవయవ దానంలో రెండు రకాలు ఉన్నాయి – సజీవ అవయవ దానం మరియు మరణం తరువాత చేసే అవయవ దానం

అవయవ దానాన్ని ఎవరు కనుగొన్నారు?

అవయవ మార్పిడి యొక్క శస్త్రచికిత్సా సాంకేతికతలో మార్గదర్శకమైన పనిని 1900ల ప్రారంభంలో ఫ్రెంచ్‌ సర్జన్‌ అలెక్సిస్‌ కారెల్‌, చార్లెస్‌ గుత్రీతో కలిసి ధమనులు లేదా సిరల మార్పిడితో మొదటిసారి అవయవ మార్పిడి చేశారు.

అవయవ దానం అంటే ఏమిటి?

అవయవ దానం అనేది ఒక వ్యక్తి తన శరీరంలోని అవయవాన్ని మరొక వ్యక్తికి ఇష్టపూర్వకంగా దానం చేసే ప్రక్రియ. ఇంకా, ఇది మరొక వ్యక్తికి మార్పిడి కోసం ఒకరి అవయవాన్ని తొలగించడాన్ని అనుమతించే ప్రక్రియ.

భారతదేశంలో మొదటి అవయవ దాత ఎవరు?

అవయవ గ్రహీత అలోయిస్‌ గ్లోగర్‌, కార్నియాలు దెబ్బతిన్న 45 ఏళ్ల రోజువారీ కూలీ. మార్పిడి తర్వాత అతని ఒక కన్నుతో స్పష్టంగా చూడగలిగాడు కానీ మరొక కంటికి సమస్యలు ఉన్నాయి. భారతదేశంలో మొట్టమొదటి కార్నియా మార్పిడి 1948లో జరిగింది.

ఇక్కడ అనేక రకాల అవయవ, నేత్ర మరియు కణజాల (టిష్యూ) దానం ఉన్నాయి మరియు ప్రతి ఒక్కటి మార్పిడి కోసం ఎదురుచూస్తున్న వేలాది మందిలో కొత్త ఆశను చిగురింపచేస్తాయి.

·         అవయవ దానం. …

·         కణజాల దానం. …

·         నేత్రదానం. …

·         జీవిస్తున్న వ్యక్తి మరొకరికి అవయవ దానం …

·         పరిశోధన కోసం విరాళం ఇవ్వడం …

·         బోన్‌ మ్యారో మరియు బ్లడ్‌ స్టెమ్‌ సెల్‌ దానం.

ఒక అవయవ దాత ఎంతమంది ప్రాణాలను రక్షించగలడు?

మరణించిన ఒక అవయవ దాత తన అవయవాల ద్వారా ఎనిమిది మంది ప్రాణాలను కాపాడగలరు! దానం చేసిన రెండు కిడ్నీలు ఇద్దరు రోగులను డయాలసిస్‌ చికిత్సల నుండి విముక్తి చేయవచ్చు. వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్న ఇద్దరు రోగులకు దానం చేయబడిన కాలేయాన్ని రెండుగా చేసి ఇద్దరికీ అమర్చవచ్చు.

అవయవ దానానికి ఎవరు అనర్హులు?

హెచ్‌ఐవి ఉండటం, క్యాన్సర్‌తో బాధపడే వారు లేదా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ వంటి కొన్ని పరిస్థితులు ఉన్నవారు అవయవ దానం నుండి మినహాయించబడతారు. క్యాన్సర్‌, హెచ్‌ఐవి, మధుమేహం, కిడ్నీ వ్యాధి లేదా గుండె జబ్బులు వంటి తీవ్రమైన పరిస్థితి ఉన్న వ్యక్తి సజీవ దాతగా అవయవ దానం చేయలేడు.

జీవించి ఉన్న దాతలు విరాళం ఇవ్వడానికి ముందు ధూమపానాన్ని పూర్తిగా మానేయ వలసి ఉంటుంది మరియు వ్యక్తి ఎక్కువగా ధూమపానం చేస్తుంటే, అతడు లేదా ఆమె శ్వాసను తనిఖీ చేయడానికి పల్మనరీ వైద్యుడిని సంప్రదించమని కోరవచ్చు.

డాక్టర్ శ్యామల అయ్యంగార్

సీనియర్ కన్సల్టెంట్ ఇంటర్నల్ మెడిసిన్,

అపోలో హాస్పిటల్స్, హైదర్‌గూడ.

మరింత సమాచారానికి దయ చేసి సంప్రదించండి: 9959154371 / 9963980259


SAKSHITHA NEWS