సమిష్టిగా కృషి చేస్తూ గ్రామాలను అభివృద్ధి చేసుకుందాం: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ +*
…సాక్షిత : వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ “మీతో నేను”* కార్యక్రమంలో భాగంగా మోమిన్ పేట్ మండల పరిధిలోని బూర్గుపల్లి గ్రామంలో 07:00 AM నుండి 10:15 AM వరకు పర్యటించారు.
◆ నెలలో మూడు సార్లు 1, 11, 21వ తేదీలలో త్రాగు నీటి ట్యాంకులను కచ్చితంగా శుభ్రం చేయాలన్నారు.
◆ గ్రామంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్ ఇవ్వాలని, ఎక్కడ కూడా లీకేజీలు లేకుండా చూసి, ప్రజలకు నీరు అందించాలని, ప్రజలు చెర్రలు తీయరాదని సూచిస్తూ… మిషన్ భగీరథ నీటినే త్రాగాలన్నారు, అందుకు మిషన్ భగీరథ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.
◆ గ్రామంలో మరియు పంట పొలాల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని, గ్రామంలో అవసరమైన చోట ఇంటర్ ఫోల్స్ ఏర్పాటు చేయాలని, AB స్విచ్ లు ఏర్పాటు చేయాలని, విద్యుత్ సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారం చేయాలన్నారు.
◆ గ్రామంలో ప్రజలకు అందుబాటులో ఉండి మంచి సేవలందిస్తున్న అంగన్వాడీ మరియు ANM సుజాత ఆశా వర్కర్ అంజమ్మ లను అభినందించారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు.