SAKSHITHA NEWS

మహిళల భద్రత కు ప్రాదాన్యం …వేదింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలు

-సిపి ఖమ్మం

ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

ఖమ్మం పోలీస్ కమీషనరేట్ పరిదిలో మహిళల భద్రత కోసం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు, వారి ఫిర్యాదుల పట్ల సత్వరమే స్పందించి తగిన విధంగా న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్ ఐపీఎస్ తెలిపారు. మహిళలకి ప్రయాణాల్లలో, పని ప్రదేశాల్లో, ఇతర చోట్ల ఎదురయ్యే వివిధ రకాల వేధింపుల నుండి రక్షణ కోసం షి టీమ్స్ బృందాలు అన్ని వేళలా అందుబాటులో ఉంటాయని అన్నారు.

ఫిర్యాదులు తీసుకోవడం మొదలు పరిష్కారం చూపే వరకు మొత్తం ప్రక్రియలో బాధితుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతారు. బాధితులకు నిత్యం అండగా ఉండి ధైర్యం చెప్తారు. నేరుగా షీ టీం బృందాలను కలిసి ఫిర్యాదు చేయాల్సిన పనిలేదు. డయల్‌ 100, వాట్సాప్‌, క్యూఆర్‌కోడ్‌ తదితర అనేక విధానాల్లోనూ ఫిర్యాదులు చేయవచ్చు అన్నారు.

మహిళలు మరియు పిల్లల పట్ల నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి అని ముందుగానే గుర్తించబడిన ఇబ్బందికర ప్రాంతాలలో షి టీమ్స్ ప్రతిరోజూ తమ పరిధిలో తనిఖీ చేస్తుంది నిరంతర నిఘా ఉంటుంది ఆడపిల్లలను,మహిళలను వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా, తిట్టినా, వారి ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్‌ చేసినా, సోషల్‌ మీడియా అకౌంట్లలో పోస్టు చేసినా, మిత్రులకు షేర్‌ చేసినా తీవ్రమైన నేరంగా పరిగణించి.. ఎలాంటి కఠిన శిక్షలు వేస్తున్నారో షీటీమ్స్‌ కాలేజీల్లో, స్కూళ్లలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఒకవేళ నిందితుడు మైనర్ అయితే అతడికి తల్లితండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఖమ్మం కమీషనరేట్ నందు 2024 సంవత్సరం లో ఇప్పటి వరకు (06 ఏప్రిల్ 2024 ) షి టీమ్ అవగాహన కార్యక్రమాలు 96 నిర్వహించడం జరిగింది….
ఈ సంవత్సరంలో ఇప్పటివరకు 26 మంది అమ్మాయిలు మరియు మహిళలు ఖమ్మం పోలీస్ కమిషనరేట్ షీ టీం వారిని ఆశ్రయించగా వారిని వేధించిన వారిని పట్టుకుని వారిలో కొంతమంది పై కేసులు నమోదు చేయడం జరిగింది మరియు కొంతమందిని కౌన్సిలింగ్ చేసి బైండ్ ఓవర్ చేయడం జరిగింది.
మార్చ్ నెలలో 09 ఫిర్యాదులు రాగ 4 పెట్టీ కేసులు, 3 గురికి కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగినది. అవగాహన కార్యక్రమాలు 35 నిర్వహించడం జరిగినది. గత కొన్ని రోజులుగా ఇంటర్మీడియట్ మరియు 10 వ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద మరియు పార్క్స్ వద్ద మోటార్ సైకిల్ పై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ అమ్మాయిలని ఈవిటీజింగ్ చేస్తున్న 06 మందిని ఆకతాయి లను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కౌన్సెలింగ్ ఇవ్వడం జరిగినది.

ఎవరైనా మహిళలు వేధింపులకు గురైనట్లయితే వెంటనే డయల్ 100, షీ టీం నెంబర్ 8712659222 ఫోన్ చేసి లేదా వాట్సప్ ద్వారా సమాచారం ఇవ్వవచ్చు. మహిళల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని అని తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS

DOWNLOAD APP

WhatsApp Image 2024 04 05 at 8.06.36 PM

SAKSHITHA NEWS