మహిళలు ఇందిరాగాంధీని స్ఫూర్తిగా తీసుకొని సామాజిక రాజకీయ చైతన్యం కలిగి ఉండాలి
- డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ మహిళలు ఇందిరా గాంధీని, ఆదర్శంగా తీసుకొని రాజకీయ చైతన్యం తో, మహాత్మ సావిత్రి బాయి పూలేను స్ఫూర్తిగా తీసుకొని సామాజిక చైతన్యంతో ముందడుగు వేయాలని డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు. కామేపల్లి మండలం కొమ్మి నేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వెలుగు ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు, మెహందీ కార్యక్రమం, ఓటర్ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది.- ఈ కార్యక్రమంలో డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు. మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ మహిళలు పురుషులకు దీటుగా అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నారని, పాత సాంప్రదాయాలను కట్టుబాట్లను పక్కకు నెట్టి, చదువుకోవాలని, ఇంటికి దీపం ఇల్లాలు అన్నట్లు పిల్లలకు చదువు విజ్ఞానము నేర్పించవలసిన బాధ్యత మహిళలదేనని,
రాజకీయ చైతన్యంతో ముందడుగు వేసి దేశ అభివృద్ధి కోసం కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వెలుగు కమ్యూనిటీ కోఆర్డినేటర్ వీరభద్రం, మండల ఏపీఎం సురేంద్రబాబు, అనురాధ నాగేంద్రబాబు, మల్లయ్య వంశీ అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్లు, డ్వాక్రా మహిళలు తదితరులు పాల్గొన్నారు.