SAKSHITHA NEWS

“పొదలకూరు మండలంలో మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారం”

“సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, భోగసముద్రం, చెన్నారెడ్డిపల్లి, నావూరు, నావూరు పల్లి గ్రామాలలో ఆదివారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి కాకాణి”

“గ్రామాలలో పర్యటించిన మంత్రి కాకాణికి అడుగడుగున బ్రహ్మరథం పట్టిన ప్రజలు”

“బాణాసంచా కాల్పులు, గజమాలలు, డప్పు వాయిద్యాలు, తప్పెట్లు, యువత కేరింతలతో అట్టహాసంగా కొనసాగిన మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారం “

“గ్రామాలలో వాడ వాడల, గడపగడపలో పెద్ద ఎత్తున మహిళలు విచ్చేసి మంత్రి కాకాణికి మంగళహారతులతో దీవించారు”

“మోసం చేయడమే చంద్రబాబు పని.. 2014 ఎన్నికల సమయంలో 607 హామీలు ఇచ్చి కనీసం 6 హామీలను కూడా అమలు చేయలేదని విమర్శించిన మంత్రి కాకాణి”

“టిడిపి, బిజెపి, జనసేన ఈ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేకపోయారు అని ఎవరైనా ప్రశ్నిస్తారన్న భయంతో చివరికి మేనిఫెస్టో ను కూడా ఆన్లైన్ నుంచి మాయం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీదన్న మంత్రి కాకాణి”

“రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాల మాఫీ, ప్రతి ఇంటికి ఉద్యోగం అని చెప్పి చంద్రబాబు మోసం చేశాడన్న మంత్రి కాకాణి”

“ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీలను, ఆ తర్వాత వాటిని తప్పి ఆయన మాట్లాడిన మాటలను ప్రజలకు వినిపించిన మంత్రి కాకాణి”

“2014 ఎన్నికల్లో ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే ప్రజలను కూటమి నేతలు నిండా మోసం చేశారన్న మంత్రి కాకాణి”

“అనంతరం టిడిపి, జనసేన, బిజెపి నేతలు విడిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారన్న మంత్రి కాకాణి”

“అధికారం కోల్పోయేసరికి తిరిగి టిడిపి, జనసేన, భారతీయ జనతా పార్టీలు మళ్లీ కూటమిగా ఏర్పడి వస్తున్నాయని వీరికి తగిన గుణపాఠం నేర్పాలని పిలుపునిచ్చిన మంత్రి కాకాణి”

“2019 ఎన్నికల మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు నిలబెట్టుకున్నారని గుర్తుచేసిన మంత్రి కాకాణి”

“ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరితేనే ఓటు వేయమని ధైర్యంగా అడగగలిగిన ఏకైక వ్యక్తి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అని పేర్కొన్న మంత్రి కాకాణి”

“చంద్రబాబు డ్వాక్రా రుణాలకు సంబంధించి మాట తప్పితే ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు 4 విడతల్లో డ్వాక్రా రుణాలను పూర్తిగా మాఫీ చేసి మాట నిలబెట్టుకున్న వ్యక్తి అని ప్రశంసించిన మంత్రి కాకాణి”

“2014 ఎన్నికల్లో హామీలు ఇచ్చి మోసం చేసిన చంద్రబాబు కావాలా, ప్రతి హామీని నిలబెట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి గారు కావాలా ఆలోచించుకోవాలని విజ్ఞప్తి చేసిన మంత్రి కాకాణి”

“సోమిరెడ్డి చివరి ఎన్నిక అని తిరుగుతున్నాడని, ఓట్లు వేయించుకొని ఇక మీతో నాకు సంబంధం లేదని చెప్పటమే సోమిరెడ్డి మాటలోని మర్మమని విమర్శించిన మంత్రి కాకాణి”

“తనకు చివరి ఎన్నిక అని తిరుగుతున్న సోమిరెడ్డికి ఓటు వేస్తే.. మీకు, నాకు సంబంధం లేదని సోమిరెడ్డి పరార్ అయిపోతాడని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్న మంత్రి కాకాణి”

“సోమిరెడ్డికి ఓటు వేయాలని సోమిరెడ్డి కొడుకు, కోడలు నియోజకవర్గం లో తిరుగుతున్నారని.. రేపు సోమిరెడ్డికి ఓటు వేస్తే సోమిరెడ్డి ఎక్కడ ఉన్నాడో వారికే తెలీదంటారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించిన మంత్రి కాకాణి”

“ఎక్కడ ఉంటాడో తెలియని సోమిరెడ్డికి చివరి ఎన్నిక అని ఓటు వేస్తే.. మీ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి అనేది ఒకసారి ఆలోచన చేయండి అన్న మంత్రి కాకాణి”

“నేను మరలా తిరిగి వస్తాను అనే వాడికి బాధ్యత ఉంటుంది.. మరలా నేను తిరిగి పోటీ చేస్తాను అనే వాడికి జవాబుదారితనం ఉంటుంది కానీ చివరి ఎన్నిక అని తిరుగుతున్న సోమిరెడ్డికి ఓటు వేస్తే.. మీ సమస్యలకు పరిష్కారం ఎలా ఆలోచన చేయండి అన్న మంత్రి కాకాణి”

“సోమిరెడ్డి ముసలి కన్నీరు కార్చుకుంటూ నియోజకవర్గం లో తిరుగుతున్నాడని విమర్శించిన మంత్రి కాకాణి”

“సోమిరెడ్డి రకరకాల విన్యాసాలు ప్రదర్శిస్తూ ఓట్ల కోసం తిరుగుతున్నాడని.. కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే సోమిరెడ్డి ఎక్కడికి వెళ్లాడని ప్రశ్నించిన మంత్రి కాకాణి”

“కరోనా విలయతాండవం చేస్తున్న రోజులలో, ఎంతమంది చనిపోతున్న పరిస్థితులలో సోమిరెడ్డి ప్రజలకు అండగా నిలవాల్సింది పోయి తన ప్రాణాలను కాపాడుకునేందుకు హైదరాబాద్, బెంగుళూరుకు వెళ్లి దాక్కున్నాడని విమర్శించిన మంత్రి కాకాణి”

“కరోనా సమయంలో ప్రతి ఇంటికి బియ్యం, నిత్యవసర వస్తువులను అందజేసి వారిని ఆదుకున్నామని గుర్తు చేసిన మంత్రి కాకాణి”

“కరోనా సమయంలో ప్రతి ఇంటికి ప్రభుత్వం ఇచ్చే రేషన్ కి అదనంగా 3 కోట్ల రూపాయలు విలువైన బియ్యం, వంట నూనె పంపిణీ చేశామన్న మంత్రి కాకాణి”

“కరోనా సమయంలో ప్రజల కోసం నిలబడ్డామని.. మృత్యువను సైతం ఎదుర్కొన్నామని తెలిపిన మంత్రి కాకాణి”

“అల్లీపురం రెడ్డిని 4 సార్లు ప్రజలు తరిమికొట్టినా బుద్ధి మాత్రం రాలేదని విమర్శించిన మంత్రి కాకాణి”

“సర్వేపల్లి నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో కలుపుతుంటే దీనిపై పోరాటం చేసిన చరిత్ర తమదని పేర్కొన్న మంత్రి కాకాణి”

“ఎక్కడో దూరాన ఉన్న కందుకూరును నెల్లూరు జిల్లాలో కలిపి, నెల్లూరు జిల్లాకు అత్యంత దగ్గరగా ఉన్న సర్వేపల్లిని తిరుపతిలో కలుపుతుంటే సోమిరెడ్డి పోరాటం చేయలేదని విమర్శించిన మంత్రి కాకాణి”

“నా నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని ఆరోజు పోరాటం చేశానన్న మంత్రి కాకాణి”

“సర్వేపల్లి ఇంటి బిడ్డగా ఉన్న తనను … సర్వేపల్లి కి ఎటువంటి సంబంధం లేకుండా నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని అల్లీపురం రెడ్డి గా ఉన్న సోమిరెడ్డి పనితీరును కూడా ప్రజలు గమనించి ఓటు వేయాలని కోరిన మంత్రి కాకాణి”

“ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు నాయకులు ఎన్నో హామీలు ఇస్తుంటారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారా లేదా అన్నదే ముఖ్యమన్న మంత్రి కాకాణి”

“సర్వేపల్లి ఇంటిబడ్డగా ఉన్న తను కావాలో.. లేదా నిత్యం మోసం చేసి కమిషన్ లు దండుకునే సోమిరెడ్డి కావాలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్న మంత్రి కాకాణి”

“ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరితేనే తనకు ఓటు వేయాలని ధైర్యంగా అడగగలిగే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని తెలిపిన మంత్రి కాకాణి”

“సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా రాజకీయాలు చూడలేదని పేదరికమే అర్హతగా చూసామన్న మంత్రి కాకాణి”

“దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను ఒక్క ఆంధ్ర ప్రదేశ్ లోనే అమలు చేశామన్న మంత్రి కాకాణి”

“ప్రతి ఒక్కరిని మోసం చేసిన చంద్రబాబు కావాలా.. ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి గారు కావాలో ప్రజలు నిర్ణయించుకోవాలన్న మంత్రి కాకాణి”

“దేశంలో ఎక్కడా లేని విధంగా 3 వేల పింఛన్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అని పేర్కొన్న మంత్రి కాకాణి”

“ఇతర నియోజకవర్గము నుంచి వచ్చిన అల్లిపురం రెడ్డి సర్వేపల్లి లో పోటీ చేస్తున్నాడన్న మంత్రి కాకాణి”

“అల్లీపురం రెడ్డికి కనీసం సర్వేపల్లి లో ఓటు కూడా లేదని, ఆయన ఓటు ఆయన కూడా వేసుకోలేదని ఎద్దేవా చేసిన మంత్రి కాకాణి”

“ఇప్పటికే 4 సార్లు అల్లీపురం రెడ్డిని ప్రజలు తరిమి కొట్టారని.. కానీ నేడు చివరి ఎన్నిక అంటూ ముసలి కన్నీరు కారుస్తూ గ్రామాల్లో తిరుగుతున్నాడని విమర్శించిన మంత్రి కాకాణి”

“దొడ్డి దారిన ఎమ్మెల్సీగా, మంత్రిగా చేసిన సోమిరెడ్డి కమిషన్ లు దండుకోవడమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తాడని, రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టాడని విమర్శించిన మంత్రి కాకాణి”

“సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కనీసం గిట్టుబాటు ధర కూడా రాలేదని.. దళారులు, రైస్ మిల్లర్లతో కుమ్మక్కై 50 కోట్ల కమిషన్ లు దిగమింగాడని విమర్శించిన మంత్రి కాకాణి”

“తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ప్రస్తుత సమయంలో రైతులకు గిట్టుబాటు ధర కన్నా 30% అదనంగా 22 వేల నుండి 24 వేల రూపాయల వరకు వచ్చేలా చూశామన్న మంత్రి కాకాణి”

“సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ధాన్యం ధరలు.. తాను వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ధాన్యం ధరలను రైతులు గమనించాలన్న మంత్రి కాకాణి”

“సోమిరెడ్డి అవినీతి కంపు భరించలేక పోతున్నామని విమర్శించిన మంత్రి కాకాణి”

“సోమిరెడ్డి తాను మంత్రిగా ఉన్నప్పుడు పలానా గ్రామాన్ని అభివృద్ధి చేశానని చెప్పగలిగే ధైర్యం సోమిరెడ్డి కి లేదన్న మంత్రి కాకాణి”

“సోమిరెడ్డి ఏదైనా గ్రామానికి వచ్చి పోయాడంటే నాలుగు తలలు పగలాల్సిందే.. అక్కడ వివాదాలు జరగాల్సిందేనని విమర్శించిన మంత్రి కాకాణి”

“నిత్యం ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అండగా నిలిచి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని, సర్వేపల్లి నుంచి పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేసిన రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి డా|| కాకాణి గోవర్థన్ రెడ్డి

WhatsApp Image 2024 04 01 at 12.53.07 PM

SAKSHITHA NEWS