బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా గెలుపుకై విస్తృత ప్రచారం
సాక్షిత అశ్వారావుపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజక వర్గం అశ్వారావుపేట గ్రామంలో స్థానిక మంగళ బజార్,దూదేకుల బజార్, మెరిల బజార్, గాంధీ బొమ్మ సెంటర్, నందు అశ్వారావుపేట నియోజకవర్గం శాసనసభ్యులు బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మెచ్చా నాగేశ్వరరావు మరియు సీఎం కెసిఆర్ గెలుపు కొరకు టౌన్ పార్టి ఆధ్వర్యంలో డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహిస్తూ బిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు బిఆర్ఎస్ మేనిఫెస్టో ను వివరిస్తూ కారు గుర్తుపై ఓటు వేయాలని ప్రతీ గడపకు వెళ్ళి ప్రతి ఒక్కరినీ ఓట్లు అడుగుతున్న అశ్వారావుపేట ఎంపీపీ జల్లిపల్లి.శ్రీరామమూర్తి ఈ సందర్భంగా వెళ్ళిన ప్రతి గడపలో కారు గుర్తుకే మ ఓటు అని హామీ ఇస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు జిల్లా అధికార ప్రతినిధి యు.ఎస్ ప్రకాష్ రావు,అశ్వారావుపేట పట్టణ పార్టి ప్రెసిడెంట్ సత్యవరపు.సంపూర్ణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సంకా.ప్రసాద్, మండల నాయకులు తాడేపల్లి.రవి,తాళం.సూరి, లింగిసెట్టీ.వెంకటేశ్వరరావు, లింగంకుంట.కృష్ణా సోమని.రమేష్,కిరణ్,త్రినాథ్,శివ, నక్కా.రాంబాబు,వెంకటేశ్వర రావు, హుస్సేన్, వెంకటేష్, శివ, మరియు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.