SAKSHITHA NEWS

What is the plan for job fairs?

జాబ్ మేళాల ప్రణాళిక ఏమిటీ?

కేంద్రాన్ని లిఖితపూర్వకంగా ప్రశ్నించిన బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ
నామ నాగేశ్వరరావు
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

దేశ వ్యాప్తంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించిన జాబ్ మేళాల పని తీరేలా ఉందని, ఇందుకు సంబంధించి కేంద్రం వద్ద ఉన్న ప్రణాళిక ఏమిటో తెలియజేయాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని లిఖితపూర్వకంగా అడిగారు.

రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి, ఏమైనా ప్రణాళిక రూపొందించారా? అని ప్రశ్నించారు. జాబ్ మేళాలు నిరుద్యోగులకు ఏ మేరకు ఉపయోగపడుతున్నాయని అన్నారు. జాబ్ మేళాలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ తో నహా జిల్లాల వారీగా సమగ్ర సమాచారాన్ని తెలియజేయాలని ఎంపీ నామ కేంద్రాన్ని కోరారు.

జాబ్ మేళాల ద్వారా ఏ ఏ డిపార్ట్మెంట్ల ద్వారా ఏ మేరకు ఉద్యోగాలు కల్పించారో తెలియజేయాలన్నారు. గత అయిదేళ్లలో నిర్వహించిన జాబ్ మేళాల వివరాలు తెలియజేయాలన్నారు. వర్చువల్ జాబ్ మేళాల నిర్వహణకు సంబంధించి గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో మౌళిక సదుపాయాల విషయంలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటో తెలపాలన్నారు.

కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖా మంత్రి రామేశ్వర్ తెలి సమాధానం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి, వివిధ శాఖల ద్వారా జాబ్ మేళాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేరీర్ కౌన్సిలింగ్ ఒకేషనల్ గైడెన్స్, స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కెరీర్ సేవలు అందించేందుకు మోడల్ కెరీర్ సెంటర్లు ఏర్పాటు చేశామని సమాధానం చెప్పారు. దేశ వ్యాప్తంగా కొత్తగా 370 మోడల్ కెరీర్ సెంటర్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు.


SAKSHITHA NEWS