సమన్వయంతో పార్టీ విజయం కోసం కృషి చేయాలి
— వెలిమినేడులో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో విస్తృతస్థాయి సమావేశం
చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాలే తిరిగి మళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలోని శివం గార్డెన్ బిఆర్ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో మండలంలోని గుండ్రాంపల్లి, వెలిమినేడు, పెద్దకాపర్తి, చిన్నకాపర్తి, ఆరెగూడెం, బోయగుబ్బ, బొంగోనిచెర్వు, పిట్టంపల్లి, ఏపూరు, పేరేపల్లి, సుంకెనపల్లి గ్రామాల ముఖ్య నాయకులు కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో అందుతున్న సంక్షేమ పథకాల అమలు, క్షేత్ర స్థాయిలో పార్టీ పరిస్థితులని గూర్చి నాయకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణకు ఉద్యమ నాయకుడే తొలి ముఖ్యమంత్రి అయిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కిందని అన్నారు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాలను ప్రవేశపెట్టారని, ఇకనుండి గ్రామస్థాయి నుండి పార్టీ పటిష్టతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల పసలేని విమర్శలను, అసత్య ప్రచారాలను ఆధారాలతో తిప్పికొట్టాలని కోరారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రతి గడప గడపకు తీసుకెళ్లి ప్రజలకు వివరించాలని అన్నారు. త్వరలో రాష్టం లో జరిగే ఎన్నికలకు పార్టీ శ్రేణులు సన్నదం కావాలని సూచించారు.
ఈ కార్యక్రమం లో ఎంపీపీ కొలను సునీత వెంకటేష్, జడ్పీటీసీ సుంకరి ధనమ్మ యాదగిరి, మండల పార్టీ అధ్యక్షులు ఆవుల అయిలయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లారెడ్డి,
మహిళా విభాగం అధ్యక్షురాలు చెరకుపల్లి శశిరేఖా మహేష్, పిఎసిఎస్ చైర్మన్ రుద్రారపు బిక్షపతి, కార్మిక మండల విభాగం అధ్యక్షులు కొలను సతీష్, వివిధ గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, ఉపసర్పంచ్ లు,పార్టీ సీనియర్ నాయకులు,గ్రామ శాఖ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి లు, యువజన విభాగం అధ్యక్షులు, పార్టీ మహిళ నాయకులు పాల్గొన్నారు.