ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్
సాక్షితసికింద్రాబాద్ : నిరుపేదలకు సైతం అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకు తమ వంతు కృషి చేస్తున్నామని, ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేసుకుంటున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని 56 మంది లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన సితాఫలమండీ లోని క్యాంపు కార్యాలయంలో అందించారు. కార్పొరేటర్లు సామల హేమ, రాసురి సునీత, కంది శైలజ, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, తెరాస యువ నేత లు తీగుల్ల కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్ లతో పాటు నేతలు, అధికారులు పాల్గొన్నారు. రూ. 27 లక్షల విలువ చేసే 56 చెక్కులను పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా అందచేశారు.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పేద ప్రజలకు వరంగా నిలిచీలా వివిధ సంక్షేమ పధకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు జరుపుతోందని తెలిపారు. గత నాలుగున్నర సంవత్సరాల కాలంలో దాదాపు 2500 మందికి రూ.25 కోట్ల మేరకు నిధులను ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అందించామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తమ అభ్యర్ధనకు వెన్వెంటనే స్పందిస్తూ నిధులు మంజూరు చేస్తున్న ముఖమంత్రికి ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ కృతఙ్ఞతలు తెలిపారు.