మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్,స్థానిక బీజేపీ నాయకుల తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ కోలన్ గోపాల్ రెడ్డి

Spread the love

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనులపై మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్,స్థానిక బీజేపీ నాయకుల తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డి కార్యాలయంలో NMC ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ ఆగం పాండు ముదిరాజ్ ,కార్పొరేటర్ సురేష్ రెడ్డి గారు,NMC బిఆర్ఎస్ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ గారితో కలిసి విలేఖరులతో సమావేశం నిర్వహించారు…
ఈ సందర్భంగా…వారు మాట్లాడుతూ
ఇది వరకు నిజాంపేట్ గ్రామ పంచాయితీగా ఉన్నపుడు నెలకొన్న పరిస్థితులు,అదే విధంగా నూతన మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడిన తర్వాత జరిగిన పలు అభివృద్ధి పనుల రూపంలో నెలకొన్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

మున్సిపల్ కార్పొరేషన్ గా ఏర్పడ్డాక మా బిఆర్ఎస్ పాలనలో చిత్తశుద్దితో ఆయా డివిజన్ లలో అనేక నిర్మాణ అభివృద్ధి పనులు చేపట్టాం.

మా ఎమ్మెల్సీ శంభిపూర్ రాజు ,ఎమ్మెల్యే కేపీ వివేకానంద సహయ సహకారాలతో మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి సారధ్యంలో మా డిప్యూటీ మేయర్ ,కమీషనర్ , కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,NMC ఆయా విభాగాల అధికారులు ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ఎల్లపుడూ కృషి చేస్తున్నాం.

భాగంగా వారి తప్పుడు ఆరోపణలకు సమాధానంగా….ప్రగతినగర్ నుండి జేఎన్టీయూ వరకు 100 ఫీట్ రోడ్ ,ఫ్లైఓవర్,బాచుపల్లి నుండి నిజాంపేట్ ఎక్స్ రోడ్ వరకు 100ఫీట్ రేడియాల్ కొరకు మూడు సార్లు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించి,అది రెండు నియోజీక వర్గాల పరిధి కాబట్టి సంబంధిత ఎమ్మెల్యేలతో సంప్రదించి అక్కడి నుండి ఫ్లైఓవర్ వేయాలా,లేక కిందనుండి సింగిల్ ఫ్లైఓవర్ వేయాలా అని పీస్బులుటీ కోసం కమిటీ వేయడం జరిగింది.

138 కోట్ల రూపాయల వ్యయంతో బాచుపల్లి మమత హాస్పిటల్ నుండి నైన్ స్టార్ హోటల్ వరకు ఫ్లైఓవర్ నిర్మాణం,మియాపూర్ నుండి గండి మైసమ్మ వరకు 180 ఫీట్ రేడియాల్ రోడ్ ,అదే విధంగా బాచుపల్లి నుండి మల్లంపేట్ 100 ఫీట్ రోడ్ విస్తరణ,అలాగే మళ్ళంపేట్ ఓఆర్ఆర్ ఎక్సిట్ పనులు దాదాపు పూర్తి కావోస్తున్నాయి.


ఒకప్పుడు వర్షం పడితే బండారి లేఅవుట్,బాలాజీ నగర్ కమాన్ నిండి పోతుండే, 87 కోట్లతో SNDP నాలా నిర్మాణ పనులు చేపట్టి అట్టి పరిస్థితులను పునరావృతం కాకుండా చేసుకున్నాం.120 కోట్లతో డ్రైనేజ్,సీసీ రోడ్లు,ఫెన్సింగ్,ప్యాచ్ వర్క్స్,స్ట్రీట్ లైట్స్,అనేక మౌలిక సదుపాయాలు కల్పించాం.టాంకర్ల నుండి విముక్తి పొంది మంజీర నీళ్ళు ఇంటింటికి నల్ల కనెక్షన్ల రూపంలో పొందుతున్నాము.మా అభివృద్ధి ని చూసి ఓర్వలేకనే మా పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.అభివృద్ధి పనులు మొదలు పెట్టే ముందే మీరు ధర్నాలు, దీక్షలు అని హడావుడి చేసి,మా పై బురద జల్లి మీ బీజేపీ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికి ఒడిక
డుతున్నారు.ప్రజలు అన్ని గమనిస్తున్నారు.

మరోసారి అర్థం లేని తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు అని మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ మరియు స్థానిక బీజేపీ నాయకులను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రవి కాంత్, ఆవుల జగన్ యాదవ్, NMC బి ఆర్ ఎస్ పార్టీ జెనరల్ సెక్రెటరీ నాగరాజ్ యాదవ్,ఎస్సీ సెల్ జెనరల్ సెక్రెటరీ నిరుడు యాదగిరి,మరియు NMC నాయకులు,12వ డివిజన్ స్థానిక బి ఆర్ ఎస్ నాయకులు అనుబంధ కమిటీల సభ్యులు, ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page