SAKSHITHA NEWS

కార్మికుల సంక్షేమానికే మొదటి ప్రాధాన్యత – ఎమ్మెల్యే భూమన
సాక్షిత :కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చి వారి సంక్షేమం, సమస్యల పట్ల చిత్తశుద్దితో పని చేస్తున్నామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ వెనుక వైపున మునిసిపల్ స్థలంలో తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పారిశుధ్య కార్మికుల కోసం నిర్మించిన నూతన భవనాన్ని సోమవారం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీషా, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా మునిసిపల్ పారిశుధ్య కార్మికుల సంక్షేమ భవనాన్ని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించడం జరిగిందన్నారు. కార్మికులకు సంబందించిన సమావేశాలు నిర్వహించుకోవడానికి, వారి సమస్యలపై చర్చించుకోవడానికి ఈ భవనం చాలా ఉపయోగకరంగా వుంటుందన్నారు. కార్మికుల సంక్షేమం కోసం, వారి సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం ఎప్పుడూ చిత్తశుద్దితో పనిచేస్తూ వుంటుందని భూమన తెలిపారు.

తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీషా, కమిషనర్ అనుపమ అంజలి మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ మునిసిపల్ కార్పొరేషన్ కు చెందిన విలువైన స్థలంలో 30 లక్షల రూపాయాలతో కార్మికుల కోసం భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వార్డ్ కార్పొరేటర్ బసవ గీత, అదనపు కమిషనర్ సునీత, సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్, మునిసిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి, డిఈ గోమతి, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, రెవెన్యూ అధికారి లోకేష్ వర్మ, శానిటరి సూపర్ వైజర్లు చెంచెయ్య, సుమతి, మునిసిపల్ కార్మిక నాయకులు తులసేంధ్ర, మదన్ మోహన్, వైసిపి నాయకులు కట్టా గోఫి యాదవ్, బసవ బాలసుబ్రహ్మణ్యం, కాంట్రాక్టర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
………….


SAKSHITHA NEWS