రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటాం

Spread the love

రైతులను అన్నివిధాలుగా ఆదుకుంటాం

అధికారుల సర్వే నివేదికలు రాగానే పరిహారం అందిస్తాం

ఇది రైతు ప్రభుత్వం

పంట నష్టాలపై సీఎం కెసిఆర్ గారు ప్రతిరోజూ సమీక్షిస్తున్నారు

రైతులకు ధైర్యం చెప్పి భరోసానిచ్చిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

మహబూబాబాద్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు మండలం హరిపిరాల, కర్కాల గ్రామాల్లో పంట నష్టాలను పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

హరిపిరాల, కర్కాల (తొర్రూరు), మార్చి 22:
ఇది రైతు ప్రభుత్వం. సీఎం గారు రైతుల పక్షపాతి. రైతుల కోసం దేశంలో ఎక్కడా లేనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్న ప్రభుత్వం. రైతులు నష్టపోకుండా చివరకు పంటలు కూడా కొనుగోలు చేస్తుంది. ఇలాంటి ప్రభుత్వం, ఈ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న సీఎం కేసీఆర్ గారు తప్పకుండా పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తారు. రైతులు ఎట్టి పరిస్థితుల్లో అధైర్య పడాల్సిన పనిలేదు. వారికి అండగా ప్రభుత్వం ఉంటుంది. మేమంతా అన్నదాతలకు అండగా ఉంటాం… పంటలు దెబ్బతిన్న రైతులకు నష్టపరిహారం చెల్లిస్తాం. అంటూ అన్నదాతకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు భరోసానిచ్చారు. ఇటీవలి అకాల వర్షాలకు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరు మండలం హరిపిరాల, కర్కాల గ్రామాల్లో తీవ్రంగా పంట నష్టపోయిన ప్రాంతాలను పరిశీలిస్తూ ఆయా రైతులను మంత్రి పరామర్శించి ఓదార్చారు. మంత్రిని చూసిన రైతులు బోరుమన్నారు. తమకు పరిహారం ఇప్పించాలని తీరని, తీవ్ర నష్టాలలో కూరుకుపోయిన తమకు అండగా నిలిచి ఆదుకోవాలని వారు విలపించారు. ఈ సందర్భంగా వారిని ఓదార్చిన మంత్రి ధైర్యాన్ని నింపుతూ భరోసానిస్తూ, అక్కున చేర్చుకున్నారు.

మహబూబాబాద్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం, తొర్రూరు మండలం, హరిపిరాల, కర్కాల గ్రామాల్లో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి, ఆయా చోట్ల రైతులతో మాట్లాడారు.

సీఎం కెసిఆర్ గారి నేతృత్వంలో గల ప్రభుత్వం రైతులను ఆదుకుంటుందని వారికి భరోసా కల్పించారు. రైతులు ధైర్యంగా ఉండాలని చెప్పారు. ఇప్పటికే సీఎం కేసీఆర్ గారు ప్రజా ప్రతినిధులను పంట నష్టాలను పరిశీలించాలని ఆదేశించారని ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ తమతో మాట్లాడుతూ ఉన్నారని చెప్పారు.

ఈ పరిశీలనలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page