SAKSHITHA NEWS
We will stand by every farmer who has lost

నష్టపోయిన ప్రతి రైతుకూ అండగా నిలబడతాము : ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి *

సాక్షిత : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంట పంట నష్టపోయిన రైతులను నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. నరసరావుపేట రూరల్ మండలంలోని పమిడిమర్రు గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు.

పంట పొలాలను వ్యవసాయ శాఖ అధికారులుతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ… నష్టపోయిన ప్రతి రైతుకూ అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. టిడిపి పాలన లో పంట నష్టపరిహారం ఎప్పుడు చెల్లించలేదు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు గత మూడు సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం క్రమం తప్పకుండా సబ్సిడీ చెల్లిస్తూ వస్తుందన్నారు. వ్యవసాయ రంగంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు . జగన్మోహన్ రెడ్డి పాలన రైతులకు స్వర్ణ యుగమన్నారు. చంద్రబాబు పరిపాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదన్నారు

నాడు వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబే.. ఇవాళ పొలాలు పట్టుకుని తిరుగుతున్నారని అన్నారు