మౌలిక వసతుల కల్పనతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతాం

Spread the love

మౌలిక వసతుల కల్పనతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చి దిద్దుతాం : ఎమ్మెల్యే కేపీ. వివేకానంద …


*సాక్షిత : *సుమారు 81 లక్షల రూపాయలతో చేపట్టిన అభివృధ్ధి పనులను ప్రారంభించడంతో పాటు 15 లక్షల రూపాయల వీధి దీపాల పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

కొంపల్లి మున్సిపాలిటీలోని కమాన్ నుంచి శివాలయం వరకు 15 లక్షల రూపాయలతో చేపట్టనున్న వీధి దీపాల ఏర్పాటు పనులకు శంకుస్థాపన చేయగా, 76 లక్షల రూపాయలతో ఇప్పటికే నూతనంగా చేపట్టిన బీటీ రోడ్డు, అంగన్ వాడి సెంటర్ నందు 5.00 లక్షల రూపాయలతో చేపట్టిన కిచెన్ షెడ్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్ధానిక ఛైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్ తో కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ.వివేకానంద మాట్లాడుతూ నగర శివారు ప్రాంత మున్సిపాలిటీలలో మౌలిక వసతుల కల్పనకు శాయశక్తుల కృషిచేస్తున్నామని, మౌలిక వసతుల కల్పనతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే కేపీ.వివేకానంద అన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, సీనియర్ నాయకులు బూరుగుబావి హనుమంతరావు, కౌన్సిలర్లు పూజారి వసంత, డప్పు కిరణ్, పాక్స్ డైరెక్టర్లు సిహెచ్ మధు, మల్లేష్, మహిళా అధ్యక్షురాలు సంగీతారెడ్డి, సీనియర్ నాయకులు చింతల దేవేందర్ యాదవ్, లక్ష్మణ్ గౌడ్, జంధా కుమార్, మహేష్, యాదగిరి, రాజు, రవీందర్ రెడ్డి, షన్ను తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page