సూర్యాపేట ను పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేస్తాం

Spread the love

ఫ్యాషన్ రంగంలో నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్న సూర్యాపేట

……

సాక్షిత : ఫ్యాషన్ రంగంలో నగరాల దీటుగా సూర్యాపేట ఎంతో అభివృద్ధి చెందుతుందని,సూర్యాపేట జిల్లాను పారిశ్రామిక రంగంగా అభివృద్ధి చేస్తామని మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి తెలిపారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విజయవాడ జాతీయ రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన వాస ది ఫ్యాషన్ హబ్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగుల కొరకు ఎదురు చూడకుండా స్వయం ప్రతిపత్తి పై రాణించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువ పారిశ్రామిక వ్యక్తులకు రెడ్ కార్పోరేట్ పరుస్తుంది అన్నారు. సూర్యాపేట జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు. హైదరాబాద్ తదితర నగరాలకు వెళ్లకుండా సూర్యాపేటలోనే వినియోగదారులకు అన్ని రకాల వస్తువులు లభిస్తున్నాయని తెలిపారు. యువ వ్యాపారులు పరిశ్రమలు ఏర్పాటుచేసి నిరుద్యోగ యువతకు జీవనోపాధి కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేనారెడ్డి, రామ్ రెడ్డి సర్వోత్తమ రెడ్డి, కౌన్సిలర్ కక్కిరేణి శ్రీనివాస్, జహీర్, రాపర్తి శ్రీనివాస్ ,దిలీప్ రెడ్డి, శబరి షాపు యజమాని వాస ఉమారాణి, శబరినాథ్ మహేష్ బిందు ఈగ రాములు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page