మోడల్ కార్పొరేషన్ గా నిజాంపేట్ ను తీర్చిదిద్దుతాం…
‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 30వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…
బాచుపల్లి రాజీవ్ గాంధీ నగర్, హిల్ కౌంటిలలో స్థానిక ప్రజాప్రతినిధులతో ఎమ్మెల్యే పాదయాత్ర…
రూ.67 లక్షలతో పూర్తి చేసిన సీసీ రోడ్లు ప్రారంభం…అభివృద్ధి పనులు పూర్తి చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో ‘ప్రగతి యాత్ర‘లో భాగంగా 30వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా 15వ డివిజన్ రాజీవ్ గాంధీనగర్ పత్తికుంట వద్ద రూ.35 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డు, చైన్ లింక్ మెష్, రూ.17 లక్షలతో భూగర్భడ్రైనేజీ, రూ.15 లక్షలతో పూర్తి చేసిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి , డిప్యూటీ మేయర్ దన్ రాజ్ యాదవ్ , కమిషనర్ రామకృష్ణ రావు , స్థానిక కార్పొరేటర్ సుజాత తో కలిసి ప్రారంభించారు. అనంతరం రూ.1.80 కోట్లతో నిర్మిస్తున్న 10 లక్షల లీటర్ల సామర్ధ్యం గల మంచినీటి రిజర్వాయర్ పనులు పరిశీలించి, ఏప్రిల్ వరకు పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. రూ.13 లక్షలతో జరుగుతున్న బస్తీ దవాఖాన నిర్మాణ పనులను పరిశీలించారు.
రూ.10 లక్షలతో టెండర్ ప్రక్రియలో ఉన్న వైకుంఠ ధామం, రూ.20 లక్షలతో ముస్లీం గ్రేవియార్డు ప్రహరిగోడ నిర్మాణ పనులు వేగంగా చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. చివరగా 20వ డివిజన్ పరిధిలోని హిల్ కౌంటీ ( మైథాస్ )లో కార్పొరేటర్ బాలాజీ నాయక్ తో ఎమ్మెల్యే గారు పర్యటించి 10 లక్షల లీటర్ల సామర్ధ్యం గల రిజర్వాయర్ పనులు పరిశీలించారు. క్లబ్ హౌస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కాగా కాలనీ వాసులకు ఇబ్బంది లేకుండా డంపింగ్ యార్డు, గ్రేవియావార్డు వేరొక చోటకు బదిలీ చేసినందుకు ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలిపారు. అక్కడే ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ స్థలంలో పరేడ్ గ్రౌండ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ని కోరారు. అదే విధంగా అదనంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే ని కోరగా స్పందించి త్వరలోనే ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఈఈ సుదర్శన్ రావు, వాటర్ వర్క్స్ డిజిఎం మహేష్ మరియు కార్పొరేటర్లు, ఎన్ఎంసీ బిఆర్ఎస్ ప్రెసిడెంట్ రంగరాయ ప్రసాద్, నాయకులు, మైనార్టీ, క్రిస్టియన్ సోదరులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు