బాపట్ల జిల్లా
ఉద్యోగుల న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యే వరకు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం JAC జిల్లా చైర్మన్ సి.హెచ్.సురేష్ బాబు.
నల్లకండువాలతో నిరసన తెలుపుతున్న APJAC అమరావతి బాపట్ల జిల్లా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులు, కాంట్రాక్టు మరియు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
APJAC అమరావతి రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిన రెండో విడత ఉద్యమ కార్యచరణలో భాగంగా ఈరోజు కార్యక్రమం అనగా 08-04-2023 స్థానిక తాలూకా కార్యాలయ ఆవరణల నుండు బస్టాండ్ మెయిన్ రోడ్ లలో “నల్ల బ్యాడ్జీలు నల్ల కండువాలు ధరించి ఉద్యోగుల డిమాండ్లు తో కూడిన ప్లకార్డులు ప్రదర్శించడం, ర్యాలీ నిర్వహించడం జరిగింది.”
👉 ఉద్యోగులకు పెన్షన్ దారులకు ఒకటవ తేదీని జీతాలు పెన్షన్లు చెల్లించాలి
👉 సిపిఎస్ ని రద్దుచేసి పాత ఒపీఎస్సీ పునరుద్ధరించాలి
👉 ఈ హెచ్ ఎస్ ద్వారా క్యాస్ లెస్ వైద్యం జరగాలి
👉 12వ పే రివిజన్ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి
👉 కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేయాలి
👉 పెండింగ్లో ఉన్న మూడు కొత్త డియేలను విడుదల చేయాలి
👉 పిఆర్సి అరియర్స్ ను వెంటనే చెల్లించాలి.
వంటి స్లొగన్స్ తో ప్రభుత్వ ఉద్యోగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏపీ జెఎసి
అమరావతి బాపట్ల జిల్లా చైర్మన్ సి.హెచ్.సురేష్ బాబు, జనరల్ సెక్రెటరీ కె.రజనీకాంత్, వైస్ చైర్మన్ పి.మురళి మనోహరరెడ్డి, ట్రెజరర్ య.దిలీప్, జిల్లా ఉపాధ్యక్షులు వై.శ్రీనివాసరావు, ఏపీ ఆర్ ఎస్ ఎ సిటీ యూనిట్ సెక్రెటరీ ఏ. సుమంత్ కుమార్, VRO అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ డి.చంద్ర, VRA అసోసియేషన్ రాష్ట ట్రెజరర్ యమ్. సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు కె.శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్ డి.పద్మావతి, మరియు PTD (RTC) ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగులు, రెవెన్యూ ఉద్యోగులు, నాలుగవ తరగతి ఉద్యోగులు, కో అపరేటివ్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు, పంచాయతీ రాజ్ శాఖ ఉద్యోగులు, RWS శాఖ ఉద్యోగులు, VRO, VRA, సివిల్ సప్లైస్ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.