We will support mango farmers and victims of collapsed houses
మామిడి రైతులను, ఇండ్లు కూలిపోయిన బాధితులను ఆదుకుంటాం.. సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి అప్రమత్తం చేసిన.. స్థానిక ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి..
నియోజకవర్గంలో ని వివిధ మండలాలలో పర్యటించి, జిల్లా కలెక్టర్ తో మాట్లాడి అధికారులను అప్రమత్తం చెయ్యాలని కోరారు.. రైతులు ఎవరు అధైర్య పడొద్దని మీ అందరికి అండగా ప్రభుత్వం ఉంటుందని భరోసా కల్పించిన స్థానిక శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని ఝాన్సి రాజేందర్ రెడ్డి ..
బలమైన ఈదురు గాలులతో పాటు వడగళ్ల వర్షానికి మామిడి రైతులకు అపార నష్టం వాటిల్లిందని, పేదల ఇండ్లు ఈదురు కు లేచిపోవడంతో పాటు కూలిపోయాయని బాధితులందరినీ ఆదుకునేందుకు సత్వర చర్యలు చేపడతామని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు..
ఆదివారం సాయంత్రం విచిన బలమైన ఈదురుగాలులకు, వడగండ్ల వర్షానికి మొక్కజొన్న, మామిడికాయలు, రాలిపోవడంతో పాటు ఇండ్లు కూలిపోయాయి అన్న సమాచారాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి .. సోమవారం పాలకుర్తి మండలం వావిలాల, మంచుప్పుల, గుడికుంట తండాలను సందర్శించి నష్ట పరిహారాన్ని పరిశీలించారు.
బాధితుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నష్ట పరిహారంపై నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి మాట్లాడుతూ.. వడగళ్ల వర్షానికి, ఈదురు గాలులకు నష్టపోయిన మామిడి రైతులకు, పంట రైతులకు నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు..
ఇండ్లు కూలిపోయిన బాధితులకు ప్రజా పాలనలో ప్రభుత్వం అందించే గృహాల ను మొదటి ప్రాధాన్యతలో కేటాయిస్తామని భరోసా ఇచ్చారు. రైతులెవ్వరు అధైర్య పడరాదని, ఎన్నికల అనంతరం పరిహారాన్ని అందజేస్తామని తెలిపారు..
ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రిద్య్ వెంట.. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, సీనియర్ నాయకులు నిరంజన్ రెడ్డి, మండల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి, సురేష్ నాయక్, కుమార్, రాజేష్ నాయక్, హరీష్, స్థానిక నాయకులు, గ్రామస్థులు, పాల్గొన్నారు..
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
Sakshitha News
Download app
https://play.google.com/store/apps/details?id=com.sakshithaepaper.app
Sakshitha Epaper
Download app