యెనుకటి ఎండిన బతుకుల యెతలు మనకు వద్దు

SAKSHITHA NEWS

యెనుకటి ఎండిన బతుకుల యెతలు మనకు వద్దు…
*నేటి రైతు సంక్షేమమైన కేసీఆర్ సార్ పాలననే మనకు ముద్దు: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *


సాక్షిత : * వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే *డాక్టర్ మెతుకు ఆనంద్ కోట్ పల్లి మండల పరిధిలోని రాంపూర్ రైతు వేదికలో మరియు మర్పల్లి మండల పరిధిలోని కల్కోడ రైతు వేదికలో నిర్వహించిన రైతుల సమావేశాల్లో పాల్గొన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నాడు దండుగన్న వ్యవసాయాన్ని స్వరాష్ట్ర తెలంగాణలో నేడు పండుగగా చేసిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ కి దక్కుతుందన్నారు, నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి మన రాష్ట్రం ఎదుగుతున్న పద్ధతిని చూసి ఓర్వలేని, చంద్రబాబు నాయుడి ఏజెంట్ రేవంత్ రెడ్డి మళ్లీ పాత రోజులను తీసుకువస్తాం మూడు గంటల కరెంటు సరిపోతుందని అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటు అన్నారు.
గత పాలనలో రైతు వ్యతిరేక విధానాలను అనుసరించిన వారు నేడు మళ్ళీ అధికారంలోకి వచ్చి అదే రైతు వ్యతిరేక విధానాలను అమలు చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి రైతాంగం దీన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త వహించాలన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయతో చేరువుల పూడిక తీయడం వల్ల చెరువులు నిండుగా నిండి, భూగర్భ జలాలు పెరిగి బోరు బావుల పారుకం పుష్కలంగా ఉందన్నారు.
మానవ జీవన విధానానికి విద్యుత్తు వినియోగం ఎంతో
అవసరం అయిందని, అందుకే తెలంగాణ ప్రభుత్వం 24 గంటలు కరెంటు ఇస్తే, కాంగ్రెస్ మళ్ళీ 3 గంటలే అమలు చేయాలనడం సరికాదన్నారు.
తెలంగాణలో రైతు వ్యతిరేకులకు అవకాశం ఇవ్వకుండా దేశంలో ఎక్కడా లేనివిధంగా మన ప్రభుత్వం అందిస్తున్న రైతు సంక్షేమ విధానాలను ప్రజలకు తెలియజేయాలని, ఎక్కడ ప్రజలల్లో ఉన్న అక్కడ ప్రజలతో చర్చలు జరపి అప్రమత్తంగా చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page