అభ్యర్థుల ఖర్చు వివరాల తనిఖీలకు కార్యాచరణ చేస్తున్నాం
-ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్
ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు లోకసభ సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని పోటీచేయు అభ్యర్థుల ఖర్చు వివరాల తనిఖీలకు కార్యాచరణ చేసినట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు అభ్యర్థుల వ్యయ వివరాల మొదటి తనిఖీ మే 1 న, రెండో తనిఖీ మే 6న, మూడో తనిఖీ మే 10 న చేపడతారని ఆయన అన్నారు. తనిఖీలు పై తేదీలలో ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు నూతన కలెక్టరేట్ లోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో చేపడతారని ఆయన అన్నారు. అభ్యర్థులు లేదా అభ్యర్థుల వ్యయ ఏజెంట్లు సంబంధిత వ్యయ రిజిష్టర్లతో పై తేదీలలో హాజరుకావాలని, లేనిచో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం చర్యలు చేపట్టబడునని రిటర్నింగ్ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.