SAKSHITHA NEWS

నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి శ్రీమతి హరిత ఐఏఎస్*
రానున్న ఎన్నికల్లో ఈవియం, వివిప్యాట్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని తిరుపతి నియోజకవర్గ ఓటర్ నమోదు అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్ అన్నారు. ఈవియం, వివిప్యాట్ల వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా సిద్దం చేసిన ఈ వి యం ప్రదర్శన వాహనాన్ని కమిషనర్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఓటింగ్ ప్రక్రియలో మూడు మెషిన్లు ప్రథమంగా ఉంటాయని మొదటిది ఈవీఎం అనగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్, ఎంత మంది అభ్యర్థులు పోటీ చేయుచున్నారు వాళ్ళ ఎన్నికల గుర్తులుతో వరుస సంఖ్యలో ఒకటి నుంచి 16 వరకు ఉంటాయని, రెండవది వివిప్యాట్ అనగా ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయిల్, దీని ద్వారా ప్రజలు వారు ఎవరికి ఓటు వేశారో డిస్ప్లే లో చూసుకోవ డమే కాకుండా పేపర్ ద్వారా కూడా వారు ఎవరికి ఓటు వేసారో వీవీపీఏటీ లోపల భద్రం గా ఉంటాయని ఆ పేపర్లు తర్వాత ఆడిట్ లో లెక్కించటం జరుగుతుందని, మూడవది కంట్రోల్ యూనిట్ ప్రజలు వేసే ప్రతి ఒక్క ఓటు కంట్రోల్ యూనిట్ లో నమోదు అవ్వడమే కాకుండా వాళ్ళు ఓటు వేసిన తర్వాత బీప్ శబ్దం వస్తుందని, ఆ శబ్దం వచ్చాకే తదుపరి ఓటర్ ఓట్ వేయటానికి అవకాశం ఉంటుందని, ఎంతమంది ఓటు వేశారు కంట్రోల్ యూనిట్ ద్వారానే తెలుస్తుందని అన్నారు.

నగరంలోని అన్ని ప్రదేశాలలో వ్యాన్ ద్వారా ఓటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామని అన్నారు. అలాగే నగరంలోని అన్ని వార్డుల్లో సూపర్ వైజర్లతో ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద బి.ఎల్. ఓ ల తో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు. అలాగే ప్రతి రోజు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం నుండి సాయంత్రం వరకు అవగాహన కేంద్రం అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళి శ్వర్ రెడ్డి, ఆర్. ఓ. సేతుమాడవ్, ఈడిటి జీవన్, మేనేజర్ చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 12 19 at 6.45.50 PM

SAKSHITHA NEWS