ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేస్తున్నాం…

Spread the love

ప్రగతి యాత్ర”లో భాగంగా 79వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటన…

జీడిమెట్ల 132 డివిజన్ శివారెడ్డి నగర్, వెంకన్న హిల్స్ 1,2లలో పాదయాత్ర…

రూ.3.77 కోట్లతో కాలనీల అభివృద్ధికి కృషి చేసినందుకు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ లో “ప్రగతి యాత్ర”లో భాగంగా 79వ రోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ పర్యటించారు. ఈ సందర్భంగా శివారెడ్డి నగర్, వెంకన్న హిల్స్ 1,2లలో పాదయాత్ర చేస్తూ పూర్తి చేసిన అభివృద్ధి పనులను పరిశీలించి మిగిలి ఉన్న చిన్నపాటి పనులను తెలుసుకున్నారు. కాగా శివారెడ్డి నగర్ లో రూ.97 లక్షలతో కల్వర్టు, సీసీ రోడ్డు, డ్రైనేజీ పనులు పూర్తి, వెంకన్న హిల్స్ ఫేస్-1లో రూ.1.80 కోట్లతో మంజీర నీటి సరఫరా, డ్రైనేజీ, సీసీ రోడ్లు పూర్తి, వెంకన్న హిల్స్ ఫేస్-2లో రూ.1 కోటితో మంజీరా నీటి సరఫరా, సీసీ రోడ్లు, భూగర్భడ్రైనేజీ పనులు పూర్తి చేసినందుకు కాలనీల ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ మంగళ హారతులతో ఎమ్మెల్యే కి ఘన స్వాగతం పలికారు. శాలువాలతో ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం కాలనీల అభివృద్ధికి కృషి చేసినందుకు కాలనీవాసులంతా ఎమ్మెల్యే వెంటే ఉంటామని హామీ ఇచ్చారు. మిగిలి ఉన్న చిన్నపాటి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో.. అక్కడే ఉన్న సంబంధిత అధికారులకు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు. వాటిని త్వరలోనే పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సమస్యలను శాశ్వతంగా అధిగమించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పట్టించుకోని అనేక బస్తీలు, కాలనీలలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యేక దృష్టి వహించి కోట్ల రూపాయల నిధులను వెచ్చిస్తూ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పూర్తి చేస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతి కాలనీ, బస్తీ రూపురేఖలు మారుతున్నాయన్నారు. సంక్షేమ సంఘాలు ఇదే ఐక్యతతో ఉంటూ అభివృద్ధికి సహకారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ జిఎం శ్రీధర్ రెడ్డి, ఈఈ కృష్ణ చైతన్య, డిఈఈ భాను చందర్, ఏఈ సురేందర్ నాయక్ మరియు శివారెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్ రావు, జనరల్ సెక్రెటరీ గోవింద్, వెంకన్న హిల్స్ ఫేస్-1 ప్రెసిడెంట్ శ్రీనివాస్, జనరల్ సెక్రెటరీ మురళి, వెంకన్న హిల్స్ ఫేస్-2 ప్రెసిడెంట్ వెంకట్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ సుభాష్ మరియు వార్డు సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ సీనియర్ నాయకులు, ఆయా కాలనీల సంక్షేమ సంఘాల కార్యవర్గ సభ్యులు, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page