SAKSHITHA NEWS

సాక్షితతిరుపతి : ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధులుగా వుంటున్న వాలంటీర్ల సేవలు అభినందనీయమని తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. తిరుపతి నగరపాల సంస్థ కార్యాలయంలో మేయర్ ఛాంబర్ నందు వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించి వారికి సేవా మిత్ర పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడో విడతగా వాలంటీర్లకు వందనం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఉత్తమ వాలంటీర్లకు సేవా వజ్ర, సేవ రత్న, సేవా మిత్రా మూడు కేటగిరిలలో వరుసగా మూడో ఏడాది అవార్డులతో వారిని సత్కరిస్తున్నామన్నారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ వాలంటీర్ల వ్యవస్థలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. ప్రజలకి ప్రభుత్వానికి వారదలుగా నిలుస్తూ ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలియజేశారు. కోవిడ్ టైంలో ప్రతి వాలంటీర్లు కోవిడ్ సోకిన వారి ఇంటి వద్ద, ఆసుపత్రివద్ద కూడస్ చాలా సేవలు చేయడం అభినందించదగ్గ విషయమని ఈ సందర్భంగా మేయర్ అభినందించడం జరిగింది. 27వ డివిజన్ వార్డు వాలంటరీలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందించి ప్రజలకు మరింత దగ్గర కావాలని వాలంటీర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ శిరీష వారితోపాటు 27వ డివిజన్ అధ్యక్షులు చింతా భరణి యాదవ్, సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు పాల్గొన్నారు.*


SAKSHITHA NEWS