పరిపాలనను ప్రజలకు మరింత చేరువయ్యేలా చేసేందుకే వార్డు కార్యాలయాలు
ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ..
సాక్షిత : *పరిపాలనను ప్రజలకు మరింత చేరువయ్యేలా చేసేందుకే వార్డు కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని గణేష్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన డివిజన్ వార్డు కార్యాలయాన్ని ఎమ్మెల్సీ ముఖ్య అతిధిగా హాజరై స్థానిక కార్పొరేటర్ హేమలతసురేష్ రెడ్డి, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ డివిజన్ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునేందుకు అధికారులు నిత్యం అందుబాటులో ఉంటారని, వినతులను పరిశీలించి అక్కడికక్కడే పరిష్కారమయ్యే విధంగా చూస్తారన్నారు. ఇందుకు గాను అన్ని విభాగాల అధికారులు ప్రతిరోజు అందుబాటులో ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ మంగతాయారు, ఈఈ కృష్ణచైతన్య, వార్డ్ ఇంచార్జ్ కృష్ణ, అధికారులు, సిబ్బంది, డివిజన్ పార్టీ అధ్యక్షులు, కార్యదర్శి, అనుబంధ కమిటీల సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు