ప్రజలకు ప్రభుత్వ సేవలు సత్వరం అందించాలనే ఉద్దేశం వార్డు పాలన…-సబీహా గౌసుద్దీన్

Spread the love

సాక్షిత :కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని శ్రీ వివేకానంద నగర్ లో కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ * మేడ్చల్ జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు *మహమ్మద్ గౌసుద్దీన్ , వార్డు కార్యాలయం ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పట్టణ ప్రగతి దినోత్సవం అల్లాపూర్ లో ఘనంగా జరుపుకున్నాం.

పరిపాలనను పౌరులకు మరింత దగ్గరగా అందించడానికి సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ ఆలోచనలతో వార్డు పాలన వ్యవస్థలను పాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టడం జరిగిందని ఇందులో భాగంగానే అల్లాపూర్ లో వార్డ్ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వార్డు ఆఫీసర్లుగా నియమితులైన అధికారులను సిబ్బందిని ఆమె కాలువతో ఘనంగా సత్కరించారు.

డివిజన్ పరిధిలోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఫిర్యాదుల రూపంలో వెంటనే స్వీకరించి పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టడమే వార్డు పాలన వ్యవస్థల ముఖ్య ఉద్దేశం అని కార్పొరేటర్ వివరించారు.

ప్రజలకు ప్రభుత్వ సేవలు సత్వరం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వార్డుపాలన వ్యవస్థల ఉదేశాన్ని నెరవేర్చాల్సిన బాధ్యత సిబ్బందిపై ఉందని ఆమె తెలిపారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు లింగాల అయిలయ్య, కో ఆర్డినేటర్ వీరారెడ్డి, ప్రధాన కార్యదర్శి పిల్లి తిరుపతి, నాగుల సత్యం, జ్ఞానేశ్వర్, కొండల్ రెడ్డి, జాహేద్ షరీఫ్ బాబా, రమేష్, రవీందర్ రెడ్డి, తులసి రామ్, బాలయ్య, బ్రహ్మం, మాధవాచారి, మోయిజ్, మతిన్, రాము యాదవ్, మల్లేష్, మల్లికార్జున్, అబ్దుల్ హమీద్, షేక్ రఫిక్, జావిద్, నరసింహ మాస్టర్, రియాజ్, మస్తాన్ రెడ్డి, విష్ణు, బద్రు నాయక్, కాశీనాథ్ చారి, శ్రీనివాస్ రెడ్డి, సంజీవరెడ్డి, మహమూద్, మధు, శ్రీధర్, సలావుద్దీన్, రోశయ్య, సత్యనారాయణ, శేషారావు, కేశవరావు, అశోక్, రమేష్, శ్యాంసుందర్ రెడ్డి, నసీరుద్దీన్, సుభాన్, రాజయ్య, నిజాం, సలీం, అశు, అమరేందర్, ఎల్లం, మురళి, టొపి చారి, నజ్మా, పుష్పలత, సత్యమ్మ, పర్వీన్ సుల్తానా, లక్ష్మి, కొండన్న, అమ్ములు, మన్నెమ్మ, వెంకటమ్మ, వార్డు లక్ష్మి, గీత, మస్తానమ్మ. తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page