Wanting to end inequalities and untouchability by 2023.
2023లో అసమానతలు, అంటరానితనం అంతమవ్వాలని కోరుతూ…
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
కుండలో నీళ్లు తాగాడని బాలుడిని చితకబాదిన టీచర్
గుళ్లో నీళ్లు త్రాగాడని చావబాదిన పూజారి
దళితుడి శవ యాత్రను అడ్డుకున్న గ్రామస్థులు
జొమాటోలో బోయ్ దళితుడని ఫుడ్ నిరాకరణ
గుర్రం ఎక్కినందుకు దళిత వరుడి హత్య
నిత్యం పత్రికల్లో వచ్చే శీర్షికలు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఏడున్నర దశాబ్దాలయినా అస్పృశ్యత, అంటరానితమనే జాడ్యాల్ని వదిలించుకోలేకపోతున్నాము. ఎంత అభివృద్ధి సాధించినా సాటి మనిషిని ప్రేమతో చూడలేని, గుండెలకు హత్తుకోలేని అభివృద్ధి బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అమానవీయ పీడనకు గురవుతున్న దళితుల వేదన పాలకులకు పట్టడం లేదు.
మానవ సమానత్వం, సోదరభావం, సౌభ్రాతృత్వం, ప్రేమ, కరుణ లాంటి భావాలు జనించాలంటే మన పుట్టుక పరమార్ధాన్ని, మన ఉనికిని గుర్తించాలి. మనం ఎవరం? ఎక్కడ నుంచి వచ్చాము? అనే విషయాలు తెలుసుకోవాలి!
తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ ట్రస్టు ప్రచురించిన కేలండర్ ఇదే సందేశాన్ని అందిస్తుంది.
ప్రజల మధ్య సోదరభావాన్ని పెంపొందించే ఖుర్ఆన్ సందేశాలు ఆలోచింపజేస్తాయి. సందేశానికి తగ్గట్లుగా కేలండర్లో ప్రచురించిన ఫోటోలు కేలండర్ కి వన్నెతెచ్చాయి. సిటీలోని ముస్లిమ్ మహిళలు ఈ కేలండర్ ను న్యూయిర్ గిఫ్టుగా అందిస్తున్నారు.
ముహమ్మద్ ముజాహిద్