నెల్లూరు జిల్లా
బర్త్ సర్టిఫికేట్ కావాలంటే 15 వేలు కావాలని గ్రామస్థుడు రావిళ్ల వెంకటేశ్వర్లు ను డిమాండ్ చేసిన ఆత్మకూరు మండలం నువ్వూరుపాడు గ్రామ వీఆర్వో M.మాల్యాద్రి..
రావెళ్ల వెంకటేశ్వర్లు అనే రైతు నుండి తన కుమారుడి బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలంటే 15,000 వేల రూపాయల లంచం ఇవ్వాలని వీఆర్వో M. మాల్యాద్రి డిమాండ్ చేయగా వెంకటేశ్వర్లు నెల్లూరు ఏసీబీ అధికారులను సంప్రదించి పట్టణంలోని కెనరా బ్యాంకు సమీపంలో 10 వేలు వీఆర్వో కి ఇస్తూ వుండగా నెల్లూరు ఏసీబీ డి.ఎస్.పి మోహన్ ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దాడుల్లో సీఐలు శ్రీనివాస్, కిరణ్, ఆంజనేయరెడ్డి మరియు ఏసీబీ సిబ్బంది పాల్గొన్నారు.