పేదోడికి, పెత్తనదారునికి మహాసంగ్రామం
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ ద్వారా పేదలకు ఇంటి వద్ద సంక్షేమ పథకాలు అందుతున్నాయని వారి సేవలు అభినందనీయమని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అన్నారు, కోవూరు రుక్మిణి కళ్యాణ మండపం ఆవరణంలో 4 విడత వాలంటరీకి వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటరీలకు నెలకు 5000 మాత్రమే గౌరవ వేతనం ఇస్తున్నామని ఆదివారికి చాలక పోయినా కూడా, వారు సేవలు అమోఘమని గుర్తు చేశారు ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన వారికి ఇంటి వద్దకు అందించి నూతన పథకాలు కూడా దరఖాస్తు చేయడం జరుగుతుందన్నారు వారు సేవలను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం వారికి సేవ వజ్ర సేవా రత్న పేర్లతో వారిని సత్కరించడం జరుగుతుందన్నారు,
ఈ ప్రభుత్వానికి వాలంటరీలు మంచి పేరు తీసుకువస్తున్నారని కరోనా సమయాలు వారు సేవలు మరువలేనిమన్నారు, ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని గతంలో 5 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు పరిధి ప్రస్తుతం 25 లక్షలు చేసిన ఘనత ముఖ్యమంత్రికి దక్కుతుందన్నారు ఆరోగ్యశ్రీ కార్డుల ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతుందని గుర్తు చేశారు,అనంతరం వాలంటరీ సన్మానించి ధ్రువీకరణ పత్రాలను అందజేశారు,
పగటివేషగాలు ఎంతమంది వచ్చినా పార్టీలు అన్ని ఏకమైన జగన్మోహన్ రెడ్డి సింహం లాంటోడు అతన్ని ఎవరు ఏం చేయలేరు ఆ భగవంతుడు కూడా రాసేసాడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి యువజన విభాగ అధ్యక్షులు రజత్ కుమార్ రెడ్డి,రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి సభ్యులు దొడ్డం రెడ్డి నిరంజన్ బాబురెడ్డి, ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, జడ్పీటీసీ కవరగి శ్రీలత , ఎంపీపీ పార్వతి, మండల అధ్యక్షులు నలుబోలు సుబ్బారెడ్డి, జల జీవన్ మిషిన్ చైర్మన్ గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి, వైస్ ఎంపీపీ శివుని నరసింహులు రెడ్డి, సొసైటీ చైర్మన్ మల్లికార్జున్రెడ్డి, సర్పంచ్ యాకసిరి విజయ గంగవరం సర్పంచ్ లక్ష్మి కుమారి , జొన్నవాడ దేవస్థానం మెంబర్ గాజుల సుజనా,జిల్లా చేనేత విభాగ ప్రధాన కార్యదర్శి పన్నెం సుధాకర్, ప్రచార విభాగ అధ్యక్షులు అత్తిపల్లి అనుప్ రెడ్డి, మండల కోశాధికారి మావులూరు వెంకటరమణారెడ్డి, మండల సచివాలయ మండల కన్వీనర్ కవర గిరి ప్రసాద్,కోవూరు యువజన విభాగ అధ్యక్షుడు మల్లవరపు చిరంజీవి, బెల్లంకొండ విజయ్, ఎంపీటీసీలు, నాయకులు,ప్రజలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.