హైదరాబాద్: రామకృష్ణ మఠం హైదరాబాద్ స్వర్ణోత్సవాల సందర్భంగా విశేష ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ‘వివేకానంద సూక్తులు రామకృష్ణ మఠం’ అంశంపై ప్రముఖ ప్రవచనకర్త, మహాసహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావు ప్రసంగించనున్నారు. ఫిబ్రవరి 17వ తేదీన వివేకానంద ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుంచి సాగే గరికిపాటి వారి ప్రసంగాన్ని వినేందుకు అందరూ ఆహ్వానితులేనని రామకృష్ణ మఠం తెలిపింది.
తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సేవలందిస్తోన్న రామకృష్ణ మఠం స్వర్ణోత్సవాలు చేసుకుంటోంది. బేలూరు మఠ్‌కు అనుబంధంగా 1973లో హైదరాబాద్‌లోని దోమల్‌గూడలో ఏర్పాటైన రామకృష్ణ మఠం గతేడాది డిసెంబర్ నాటికి 50 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రజలకు ఆరోగ్య సేవలందించడంతో పాటు భాషా నైపుణ్యాలు నేర్పించడం, ఆధ్యాత్మిక చింతనతో కూడిన పుస్తకాల ప్రచురణ, మానవ వికాస కేంద్రం నిర్వహణ, గ్రామశ్రీ (గ్రామ సంక్షేమం) వంటి కార్యక్రమాలతో ఎనలేని సేవలందిస్తోంది…..
వివేకానంద సూక్తులు రామకృష్ణ మఠం అంశంపై ప్రముఖ ప్రవచనకర్త, మహాసహస్రావధాని డాక్టర్ గరికిపాటి నరసింహారావు ప్రసంగించనున్నారు
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…