చెన్నూర్ ఎమ్మెల్యేగా భారీ మోజార్టీతో వివేక్ వెంకటస్వామి గెలుపొంది తొలిసారిగా చెన్నూరు పట్టణం, జైపూర్, భీమారం మండల కేంద్రాలకు చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ లీడర్లు, శ్రేణులు, అభిమానులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. చెన్నూరు పట్టణంలోని పద్మశాలినగర్ నుంచి బస్టాండ్ మీదుగా అంబేద్కర్ చౌక్ వరకు నిర్వహించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విజయోత్సవ ర్యాలీలో వేలాదిగా జనం పాల్గొన్నారు.
అడుగడుగున అపూర్వ స్వాగతం పలికారు. ప్రత్యేక వాహనంపై ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఆయన సతీమణి సరోజ వివేక్, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి తదితరులు ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీలో సాగారు. కాంగ్రెస్ జిందాబాద్…చెన్నూరు టైగర్ వివేక్ వెంకటస్వామి జిందాబాద్ అంటూ పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంబేద్కర్ విగ్రహానికి వివేక్ వెంకటస్వామి పూలమాల వేశారు. అంతకు ముందు జైపూర్, భీమారం మండల కేంద్రాల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు, అభిమానులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు.