ప్రజా రంజకమైన పాలనను అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం: వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో కోట్ పల్లి మండల పరిధిలోని “మోత్కుపల్లి” గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు కమ్మరి పాండు, S. లక్ష్మణ్, K. బక్కన్న, A. రాములు, G. రాజు కాంగ్రెస్ సీనియర్ నాయకులు B. సాయన్న, A. ఎల్లయ్య, MD. మన్నన్, మోనాచారి, S. శ్రీనివాస్ రెడ్డి మరియు మర్పల్లి మండల పరిధిలోని “కొంషట్ పల్లి” కి చెందిన కాంగ్రెస్ పార్టీ నుండి అల్తాఫ్ పటేల్, వైకుంఠం, అంజద్, ఆనందం, జలీల్, “నర్సాపూర్” గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు M. రమేష్, శ్రీనివాస్, ఆజామ్, నర్సిములు, యేసు, “మర్పల్లి టౌన్” నుండి కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు దామోదర్, కటిక ముజీప్, P. చాన్, V. నర్సింహా చారి వారి అనుచరులు రెండు మండలాల నుండి మొత్తం కాంగ్రెస్ పార్టీ నుండి “250” మంది BRS పార్టీలో చేరారు.

ఎమ్మెల్యే BRS పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తూ… వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
కొద్దికాలంలోనే దీర్ఘకాలికమైన సమస్యలకు శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేయడం జరిగిందని, రాబోయే రోజుల్లో మన ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలంటే వలస వచ్చిన వారిని కాకుండా, స్థానికంగా ఉంటూ ప్రజల్లో ఉండే స్థానిక నాయకుడికి మరోసారి అవకాశం కల్పించాలన్నారు.


ప్రజల మేలుకోరి ప్రజారంజకమైన పరిపాలన అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు అండగా నిలిచి, మరింత అభివృద్ధి చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page