వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండల కేంద్రంలో ఆరోగ్య మహిళా క్లినిక్ ను ప్రారంభించారు.
▪ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళల యొక్క పరిపూర్ణ ఆరోగ్యానికి మరో ముందడుగు వేస్తూ ఆరోగ్య మహిళా క్లినిక్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, మహిళలు ప్రత్యేకంగా వారి వ్యక్తిగత ఆరోగ్య విషయాలను గోప్యంగా ఉంచుతూ వారికి మెరుగైన వైద్య సేవలను అందించడానికి తెలంగాణ
ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.