SAKSHITHA NEWS

సీపీఐ కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో 6 వ రోజు గాజులరామరం డివిజన లెనిన్ నగర్,అంబెడ్కర్ నగర్లో ఇంటింటికి సీపీఐ, ప్రజా చైతన్య యాత్రను నిర్వహించడం జరిగింది.
ఈ పాదయాత్రకు స్థానిక శాఖ కార్యదర్శులు సాయిలు, యూసుఫ్లు నాయకత్వం వహించగా ముఖ్యఅతిథిగా ఉమా మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ ,ప్రధాని మోడీ ఒక్కోసారి ఒక్కవిధంగా మాట్లాడుతూ తమ అసలు స్వరూపం చూపిస్తున్నారని అందులో భాగంగానే మోడీ ఉచితాలు ఇవ్వొడు అని అంటే నేడు కర్ణాటక రాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ అధ్యక్షుడు నడ్డా 3 గ్యాస్ సిలిండర్ లు ఉచితంగా ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని,బీజేపీ నాయకులు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షల రూపాయలు,ధరలు తగ్గిస్తామని,2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని,అవినీతి నిర్ములిస్తామని చెప్పి నేడు వాటికి వ్యతిరేకంగా అందరి దగ్గరి నుండి బాంక్ అకౌంట్ పేరుతో డబ్బులు వేయించుకుని,ప్రజలు దాచుకున్న ఎల్ ఐ సి డబ్బులను ఆధానికి దోచిపెట్టడం,ఉద్యోగాలు కల్పించే ప్రభుత్వ సంస్థలను అమ్ముకోవడం,ధరలు తగ్గించకుండా పెంచుకుంటూ పోవడం, సీబీఐ, ఈడీ దాడులు చేయించి అవినీతిపరులు తమ పార్టీలో చేరాక దాడులు మర్చిపోవడం ఇలా ఇచ్చిన అన్ని వాగ్దానాలకు వ్యతిరేకంగా పని చేయడం బీజేపీ కే దక్కిందని అన్నారు.

బీజేపీకి,మోడీ నిజంగా మంచి చేసుంటే మతం, ప్రాంతం , దేవుడు, సైన్యం పేరు వాడుకోకుండా ఓట్లు అడగాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం తల్చుకుంటే అన్ని రాష్ట్రాలలో సీలిండర్లు ధరలు తగ్గించి ఇవ్వొచ్చని ఒక్క కర్ణాటకలోనే ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. బీజేపీ చేసే రాజకీయాల వల్ల ప్రజలకు ఉపయోగం లేదని అన్నారు. గెలుపే లక్ష్యంగా కాకుండా ప్రజల కోసమే పని చేసే కమ్యూనిస్టులను ఆదరించాలని ప్రజలను కోరారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి కరపత్రాలను పంచడం జరిగింది.
వరదల ప్రవహిస్తున్న డ్రైనేజీ ,రోడ్డుపై వెళ్లలేని పరిస్థితులు లెనిన్ నగర్లో నెలకున్నాయని వెంటనే అధికారులు సమస్యను పరిష్కరించి ప్రజల బాధలను తీర్చాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యవర్గ సభ్యులు హరినాథ్,శ్రీనివాస్, సహాయ కార్యదర్శి రాము,సీపీఐ నాయకులు అఫ్సర్,ధర్మేంద్ర, యాదన్న,ఇమామ్, నరేష్, కనకయ్య,నర్సింహ,శివ,సామెల్, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS