చిట్యాల మండలంలోని సుంకేనేపల్లి గ్రామానికి చెందిన గుండ్రాంపల్లి- 2వ
ఎంపీటీసీ సభ్యుడు మర్రి వెంకటేశం గ్రామాల అభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని టీపిసిసి మాజీ కార్యనిర్వాహక కార్యదర్శి దైద రవీందర్ అన్నారు. ఎంపిటిసి మర్రి వెంకటేశం ప్రధమ వర్ధంతి సందర్భంగా వెంకటేశం విగ్రహాన్ని సుంకేనేపల్లి గ్రామంలో ఆయన కుటుంబసభ్యులు ఏర్పాటు చేసి ఆదివారం ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వెంకటేశం విగ్రహానికి టీపీసీసీ మాజీ కార్యనిర్వహక కార్యదర్శి దైదా రవీంధర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రవీంధర్ మాట్లాడుతూ మర్రి వెంకటేశం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా , ఎంపీటీసీ సభ్యుడుగా ప్రజా ప్రతినిధిగా గ్రామాభివృద్దికి పనిచేస్తూనే, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేశారన్నారు. అంతకుముందు ఆ గ్రామంలో మృతి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఆవుల లచ్చయ్య యాదవ్ మృతదేహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాలలో గుండ్రాంపల్లి- 1వ ఎంపీటీసీ సభ్యుడు దుబ్బ పద్మకుమార్, పీఏసీఎస్ డైరెక్టర్ దోర్నాల రామచంద్రం, నాయకులు ఆవుల యాదయ్య, రేబాక స్వామి, మధు. ఐలయ్య, నర్సింహ్మా, లింగస్వామి, శంకరయ్య.. నాగచారి, ఊషయ్య పాల్గొన్నారు.