SAKSHITHA NEWS

వేముల పూర్ణ కుమారుడుకు మాజీ ఎంపీ నామ ఆశీర్వాదం

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత:

ఖమ్మం పట్టణం లో ప్రముఖ గ్రానైట్ వ్యాపారి వేముల రవికుమార్ సోదరుడు వేముల పూర్ణ, మమత దంపతుల కుమారుడు నవీన్ కుమార్ వివాహం రేపు జరగనుండగా మంగళవారం నాడు ఖమ్మం నగరం లోని రాపర్తి నగర్ నందు ఉన్న వారి నివాసానికి బీ.ఆర్.యస్ మాజీ లోక్ సభపక్ష నేత, ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు వెళ్లి పెళ్లి కుమారుడుని ఆశీర్వదించి శుభాకాంక్షులు తెలిపారు అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాజీ ఎంపీ నామ కొద్దిసేపు ముచ్చటించారు.

కార్యక్రమంలో పలువురు గ్రానైట్ వ్యాపారులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు బొమ్మెర రామ్మూర్తి, మొండితోక జయకర్, రావూరి శ్రీనివాసరావు, బాణాల వెంకటేశ్వర్లు, గొడ్డేటి మాధవరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, వాసిరెడ్డి నాగేశ్వరరావు, కనుమూరి వెంకటేశ్వరరావు, కర్నాటి శ్రీను, కొటారి రాఘవరావు, ఉద్యమకారులు డోకుపర్తి సుబ్బారావు, పగడాల నరేంద్ర, మాజీ సర్పంచ్ శివాజీ పెద్ద గోపవరం, రమేష్ నాయక్, వాకదాని కోటేశ్వరరావు, బిఆర్ఎస్ యువజన నాయకులు అబ్బూరి రామన్, నామ సేవా సమితి సభ్యులు పాల్వంచ రాజేష్, తాళ్లూరి హరీష్ బాబు, రేగళ్ల కృష్ణప్రసాద్ తదితరులు ఉన్నారు


SAKSHITHA NEWS