వారాహి జనసేన ఎన్నికల ప్రచార రథం..అందుకే ఆ పేరు పెట్టాం

Spread the love


Varahi is the election campaign chariot of Janasena..that’s why we gave it that name

వారాహి జనసేన ఎన్నికల ప్రచార రథం..అందుకే ఆ పేరు పెట్టాం

వారాహి జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రథం.. వారాహితో యాత్రకు సిద్దమయ్యాం.. కానీ, వారాహి వాహనంపై పేర్ని నాని రకరకాల అననమానాలు సృష్టించే ప్రయత్నం చేశారని మండిపడ్డారు జనసేన పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్..అయితే, జనసేన చట్టానికి లోబడే కార్యక్రమాలు చేపడుతోందన్న ఆయన.. సంస్థాగతంగా పార్టీ ఇంకా బలోపేతం కావాల్సి ఉందన్నారు..

ఇప్పటికే 9 జిల్లాల్లో సంస్థాగత పటిష్టతపై చర్యలు చేపట్టాం… వారాహి జనసేన ఎన్నికల ప్రచార రథమే.. సంస్కృతిని గౌరవించుకునే విధంగా వారాహి పేరు పెట్టామన్నారు.. మేం చేపట్టే ప్రతి కార్యక్రమం ప్రజల కోణంలోనే ఉంటుందని స్పష్టం చేశారు..

ఇక, ఈ నెల 18వ తేదీన సత్తెనపల్లిలో కౌలు రైతుల భరోసా యాత్ర చేపట్టనున్నాం.. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 281 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..

కౌలు రైతుల దుస్థితి తెలియాలంటే సీఎం జగన్ సత్తెనపల్లి కౌలు రైతుల భరోసా యాత్ర సభకు రావాలంటూ సవాల్‌ విసిరారు.. మాచర్ల, గురజాల, పెదరూరపాడుల నుంచి ఎక్కువగా కౌలు రైతుల ఆత్మహత్యలు జరిగాయని వెల్లడించారు

Related Posts

You cannot copy content of this page