అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు. మొన్న ఓ వైకాపా నేత నాలుగు బొట్టు బిళ్లల స్టికర్లు ఇచ్చి ఓట్లు అడిగితే.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో టీ గ్లాసులను ప్రచారానికి వాడుకుంటున్నారు. కాగితపు టీ కప్పుపై ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల చిత్రాలు, పార్టీ గుర్తు ముద్రించి దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. మంత్రి అంబటి రాంబాబు అనుచరులు మంగళ, బుధవారాల్లో సత్తెనపల్లిలో తొలివిడతగా సుమారు 70 టీ దుకాణాలకు 200 చొప్పున టీ కప్పులను ఉచితంగా అందజేశారు. కొందరు వాటిని తీసుకోబోమంటే.. ఒత్తిడి చేసి మరీ ఇచ్చారు. దీనిపై తెదేపా నాయకులు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. మొత్తానికి దుకాణాల్లో తనిఖీలు చేసి కొన్ని టీ కప్పులను స్వాధీనం చేసుకున్నారు….
అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడం
Related Posts
పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు హాల్ టికెట్లు విడుదల
SAKSHITHA NEWS పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు హాల్ టికెట్లు విడుదల అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్. స్టేజ్-2 PMT/PET పరీక్షల దేహదారుఢ్య పరీక్షలు హాల్టికెట్లు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. డిసెంబర్ 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు…
అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న
SAKSHITHA NEWS అయ్యప్ప స్వామి మహా పడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నేత శంభీపూర్ క్రిష్ణ … కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధి దుండిగల్ తాండా1లో కొర్ర శివ నాయక్ (కన్నె స్వామి) ఏర్పాటు చేసిన…