వడ్డెరులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

Spread the love

Vadderi should be included in the ST list

వడ్డెరులను ఎస్టీ జాబితాలో చేర్చాలి

    ( సాక్షిత న్యూస్)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని వడ్డెర కులస్తులను ఎస్టీ జాబితాలో చేర్చాలని వడ్డెర సంఘం అధ్యర్యంలో అశ్వారావుపేట మండల తహసీల్దార్ కి 9 డిమాండ్ లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా వడ్డెర సంఘం సభ్యులు మాట్లాడుతూ వడ్డెర ఎస్టీ సాధనకై తెలంగాణ వడ్డెర సంఘం చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు చైర్మన్ శివరాత్రి అయిలాముల్లు ఆదేశాల మేరకు రాష్ట్రంలో సుమారు 40లక్షలు మంది వడ్డెరోలు ఉన్నారు వాళ్ళను గుర్తించి తమకు రావాల్సిన న్యాయబద్ధమైనా హక్కులను ఇవ్వాలని ఈ క్రింది విధంగాతెలిపారు

డిమాండ్స్

1)వడ్డెర్లను బి.సి. జాబితాలోనుండి తొలగించి యస్.టి. జాబితాలో చేర్చాలి.

2)వడ్డెర కార్పోరేషన్ ఏర్పాటు చేసి చైర్మన్ ను నియమించాలి. వడ్డెర కార్పోరేషన్కు రు.1000
కోట్లు నిధులు ఇవ్వాలి.

3)ప్రతి చదువుకునే వడ్డెర విద్యార్థిని, విద్యార్థులకు గురుకుల పాఠశాలలో ప్రత్యేక రిజర్వేషన్
కల్పించాలి

4)వడ్డెర కాంట్రాక్టులకు ప్రభుత్వ పనుల్లో 20శాతం ఈ ఎం.డి. లేకుండా పనులు కేటాయించాలి.
వడ్డెర్లకు ఐండ క్వారీలపైన పూర్తి హక్కులు కల్పించాలి.

5)వడ్డెరకార్మికులు వృత్తిలో ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి రు.20 లక్షలు గాయపడినవారికి రు.10 లక్షలు ప్రభుత్వం ఎక్షగ్రేషియా ఇవ్వాలి.

6)వడ్డెర జనాభా ప్రాతిపదికన రాజకీయ రిజర్వేషన్ ప్రభుత్వం కల్పించాలి. ప్రభుత్వ నామినేట్ పదవులను వడ్డెర్లకు కేటాయించాలి.

7)వడ్డెర కమ్యూనిటీ హాల్ను ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి.

8)ఉప్పల్ భగయత్ ప్రభుత్వం నిర్మించబోయే వడ్డెర ఆత్మగౌరవ భవనాన్ని మా సంఘం బలపరచిన జెరివద్ద సత్యనారాయణరాజు
ట్రస్ట్ ద్వారా నిర్మాణం చేపట్టాలి..

9)రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మింస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లలో వడ్డెరులకు అవకాశం
కల్పించాలి. తెలియజేసినారు ఈ కార్యక్రమంలోసంఘ పెద్దలు ఆకులు నాగభూతం.ఆకుల నరసింహారావు. బండారు మహేష్ .తమ్మిశెట్ట శీను. డేరంగుల ప్రసాదు.శివ రాశి కొండయ్య . పల్లకి చందర్రావు. రాములు. బండారు వెంకటేశ్వరరావు. శివరాశి శ్రీరామ్ మూర్తి .రాఘవులు. వల్లెపు శీను. తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page