SAKSHITHA NEWS

సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.

జగతగిరిగుట్ట డివిజన్ శ్రీనివాస్ నగర్లో ఉన్న బస్తి కమిటీ హాల్ ను స్థానిక నాయకుడు ఎవ్వరికి చెప్పకుండా కిరాయికి ఇచ్చి ఇప్పుడు ఖాళీ చెయ్యకుండా ఉండటం నేరమని,కావున వెంటనే మునిసిపల్ అధికారులు ఖాళీ చేయించాలని కోరుతూ నేడు శ్రీనివాస్ నగర్ బస్తి కమిటీ సభ్యులు గాజులరామరం మునిసిపల్ డెప్యూటీ కమిషనర్ మల్లారెడ్డి గారిని కలిసి చెప్పడం జరిగింది.
దానికి స్పందిస్తూ కమిటీ హాల్ ను స్వంత ఆస్తిగా వాడుకోవడం చట్ట రీత్యా నేరమని కావున వెంటనే ఖాళీ చేయిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ నగర్ బస్తి నాయకులు మురళి,కిరణ్,సంతోష్,టైసన్, చిన్న,టీంకు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 02 02 at 4.59.38 PM

SAKSHITHA NEWS