శ్రీ స్వామి అమ్మవార్లకు ఊయల సేవ

Spread the love

నంద్యాల జిల్లా

శ్రీ స్వామి అమ్మవార్లకు ఊయల సేవ

శ్రీశైలం ఆలయం సాక్షిత న్యూస్ సెప్టెంబర్:15:లోకకల్యాణం కోసం దేవస్థానంలో శుక్రవారం సాయంత్రం శ్రీస్వామి అమ్మవార్లకు
దేవస్థానం ఊయలసేవను నిర్వహించనున్నది.
ప్రతి శుక్రవారం రోజు మరియు పౌర్ణమి, మూలా నక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ జరిపించబడుతోంది ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠిస్తారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా
మహాగణపతిపూజ
జరిపించి అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామి అమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార
పూజ జరిపించబడుతుంది. తరువాత చివరగా ఊయలసేవ నిర్వహించారు ఊయలసేవను పురస్కరించుకుని శ్రీస్వామి అమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు
పుష్పాలంకరణకు గాను పలుపుష్పాలతో స్వామి అమ్మవాళ్ళను అలంకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు వేద పండితులు భక్తులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page