గ్రేట్ విజన్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు, ఆర్థిక సాయం అందజేత

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

సమాజంలో వెనుకబడిన వర్గాలను, నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకే వైరా గ్రేట్ విజన్ క్లబ్ ఏర్పాటు చేసినట్లు ఆ క్లబ్ అధ్యక్షురాలు ఉండ్రు వరలక్ష్మి పేర్కొన్నారు. వైరా కంటి ఆసుపత్రి ఆవరణలో తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామానికి చెందిన నిరుపేదలు తోర్లపాటి దాసు, మంగమ్మ అనే వృద్ధులకు గ్రేట్ విజన్ క్లబ్ ఆధ్వర్యంలో నిత్యవసర సరుకులు, ఆర్థికసాయం అందించారు. వీటిని క్లబ్ జిఎంటి కోఆర్డినేటర్ ఉండ్రు శ్యామ్ బాబు, రీజినల్ చైర్ పర్సన్ లగడపాటి ప్రభాకరరావు చేతులమీదుగా అందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తమ క్లబ్ స్థాపించి అనతి కాలంలోనే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్న క్లబ్ ప్రతినిధులను వారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో గంగవరపు కిషన్, డాక్టర్ రవిచంద్ర, వుయ్యురు రామకృష్ణ, గోపి పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page