దుబ్బాక బాలాజీ ఆలయంలో కోటి తలంబ్రాల దీక్ష
100మంది భక్తులకు పైగా పాల్గొన్నారు.
లక్షల మంది భాగస్వాములవుతున్న కోటి తలంబ్రాల దీక్ష. ప్రతి గ్రామంలోనూ, ప్రతి వాడలోను ఓ యజ్ఞంలా సాగుతున్న భద్రాచల గోటి తలంబ్రాల కార్యక్రమం శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యకులు రామకోటి రామరాజు ఆధ్వర్యంలో దుబ్బాక లోని బాలాజీ ఆలయంలో గోటి తలంబ్రాల కార్యక్రమం జరిగింది. వందలాది
మంది భక్తులు పాల్గొని 2గంటల పాటు రామనామ స్మరణ చేస్తూ ఓడ్లను గోటితో ఒలిచి తలంబ్రాలుగా తయారుచేసి రామకోటి రామరాజుకు అందజేశారు.
ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ మా గ్రామానికి భద్రాచల తలంబ్రాలు రావడం ఆనందంగా ఉందన్నారు. మేము గోటితో ఒలిచిన ఈ తలంబ్రాలే భద్రాచల సీతారాములకు కల్యాణానికి ఉపయోగించడం మా అదృష్టం అన్నారు.
ఇలాంటి అవకాశాన్ని కలిగించిన రామకోటి రామరాజు అతని చేస్తున్న ఆధ్యాత్మిక సేవలు అమోఘమని కమిని సభ్యులు, శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో అర్చకులు లక్ష్మీనరసింహచార్యులు, చింత నాగేందర్, తదితరులు పాల్గొన్నారు.