TWJ’s objective is the welfare of journalists
జర్నలిస్టుల సంక్షేమమే టీయూడబ్ల్యూజే లక్ష్యం
— 7న జరిగే ఖమ్మం నగర మహాసభను జయప్రదం చేయండి
— టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా ఏర్పడిన టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్), మీడియా అకాడమీ చైర్మన్, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ సారధ్యంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడుతున్నారని టీయూడబ్ల్యూజే (టిజెఎఫ్) జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ అన్నారు. ఖమ్మం ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన ఖమ్మం నగర జర్నలిస్టుల సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల కమిటీల ఏర్పాటు, అనంతరం జిల్లా మహాసభలను ఘనంగా నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. అందులో భాగంగానే డిసెంబర్ 7న ఖమ్మం నగర మహాసభలను టీఎన్జీవోస్ ఫంక్షన్ హాల్ లో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ మహాసభను జయప్రదం చేయాలని జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. కరోనా బారిన పడిన జర్నలిస్టులకు ప్రభుత్వం, మీడియా అకాడమీ, యూనియన్ సహకారంతో కరోనా బాధితులకు యూనియన్లకతీతంగా సహాయం అందించామని, వివిధ కారణాలతో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయంచేసి అండగా నిలిచిన ఘనత తమ సంఘందే అన్నారు.
జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి, అభ్యున్నతకోసం నిరంతరం పాటుపడే టియుడబ్ల్యూజేను ఆదరించాలని జర్నలిస్టులకు పిలుపునిచ్చారు. ఈనెల 7న జరిగే ఖమ్మం నగర మహాసభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ సన్నాహక సమావేశంలో యూనియన్ జిల్లా, నగర నాయకులు వెన్నబోయిన సాంబశివరావు, చిర్రా రవి, రామ్ శెట్టి విజేత, శెట్టి రజినీకాంత్, గుద్దేటి రమేష్ బాబు, అమరవరపు కోటేశ్వరరావు, కొరకొప్పుల రాంబాబు, మందటి రమణ, రాఘవ, ముత్యాల కోటేశ్వరరావు, నాగరాజు, రాజేంద్రప్రసాద్, కెవి, టీఎస్ చక్రవర్తి, జానీ పాషా, భాస్కర్, జగదీష్, మోహన్, యాదగిరి, జక్కుల వెంకటరమణ, పిన్నెల్లి శ్రీనివాసరావు, పిన్ని సత్యనారాయణ, సంతోష్, ఉత్కంఠం శ్రీనివాస్, గోపి, పురుషోత్తం, వెంకటరెడ్డి, జీవన్ రెడ్డి, పానకాలరావు, ఏర్పుల నాగేశ్వరరావు, మెట్రో నాగేశ్వరావు, నల్లమోతు శ్రీనివాస్, మందుల వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, హుస్సేన్, సతీష్, అశోక్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.