తిరుపతి అభివృద్దితోబాటు ఆధ్యాత్మికంగ ముందుకెలుతున్నది : టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి

Spread the love

తిరుపతిలో ఓక వైపు అభివృద్ది దిశగా, మరోవైపు ఆధ్యాత్మిక వాతావరణం వెల్లు విరిసేలా ముందుకెల్లుతున్నదని టీటీడీ చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి ఇస్కాన్ రోడ్డును కలుపుతూ చెన్నారెడ్డి కాలనీ వైపు నుండి నిర్మించిన నూతన కనెక్టవిటీ రోడ్డును శనివారం టీటీడీ చైర్మెన్, తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ కాలనీలో ముద్రనారాయణ, తిరుపతి ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు రేవతి రమణదాస్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ నేడు ప్రారంభిస్తున్న ఈ నూతన రహదారికి ఇస్కాన్ టెంపుల్స్ వ్యవస్థాపకులైన అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి పేరును ఈ మార్గానికి నామకరణం చేయడం చాలా సంతోషంగా వుందన్నారు.

తిరుపతిలోని నూతన రహదారులకు మహనీయుల పేర్లను పెట్టడం వలన ఓక ఆధ్యాత్మిక వాతావరణం వెల్లి విరుస్తున్నదన్నారు. రహదారి ప్రారంభోత్సవ అనంతరం చెన్నారెడ్డి కాలనీలో నిర్మిస్తున్న ఊటగుంటను భూమన కరుణాకర రెడ్డి పరిశీలిస్తూ పూరతనమైన ఈ ఊటగుంట ఆనాడు తిరుమలకి వెల్లే యాత్రికులకు త్రాగునీరు అందించేదని, అటు తరువాత గాలిగోపురం దగ్గర, కాలిబాటలోని లక్ష్మీ నరసింహ ఆలయం దగ్గర వుండే ఊటు గుంటలు భక్తులకు త్రాగునీరు అందించేవని, ఈ మూడు పూర్తిగా పాడైపోవడంతో తిరిగి పునః నిర్మిస్తున్నట్లు తెలిపారు. మునిసిపల్ కార్పొరేషన్ నిధులతో చెన్నారెడ్డి కాలనీలో అతి సుందరంగా, ఆధ్యాత్మిక వాతావరణం వెల్లి విరిసేలా నిర్మిస్తున్న ఈ కుంటను ప్రారంభించిన తరువాత ఇస్కాన్ టేంపుల్ ఆధ్వర్యంలో నిర్వహణ భాధ్యతలు చేపడుతామని తిరుపతి ఇస్కాన్ టెంపుల్ నిర్వాహకులు రేవతి రమణదాస్ ప్రకటించడాన్ని టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి అభినందించారు.

డిప్యూటీ మేయర్, తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్ధి భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా చెన్నారెడ్డి కాలనీ, సింగాలగుంట, కనకభూషణం లే అవుట్ ప్రజలు ఎదుర్కొంటున్న కనెక్టవిటి రోడ్డు ట్రాఫిక్ సమస్యలకు తెర దించుతూ ఈ నూతన రహదారిని నిర్మించడం జరిగిందన్నారు. తిరుపతి అభివృద్దికి మరిన్ని మాస్టర్ ప్లాన్ రోడ్లను తీసుకురావడం జరుగుతుందన్నారు. రానున్న కాలంలో తిరుపతి నగరం మరింత అభివృద్ది సాదించేలా మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పనులను చేపట్టడం జరుగుతుందని భూమన అభినయ్ రెడ్డి తెలిపారు.

మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అదితి సింగ్ మాట్లాడుతూ 95 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల మార్గము అందుబాటులోకి రావడం వలన ఒక మంచి కనెక్టవిటి రహదారి ప్రజలకు ఉపయోగంలోకి వచ్చిందన్నారు. త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రామస్వామి వెంకటేశ్వర్లు, పుణిత, వరికుంట్ల నారాయణ, మునిసిపల్ ఇంజనీర్ వెంకట్రామిరెడ్డి, డిఈ విజయకుమార్ రెడ్డి, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, నాయకులు బొగ్గుల వెంకటేశ్వర్లు, అరుణ్ కుమార్, శ్యామల, పెరుగు బాబుయాదవ్, వంశి, రాజశేఖర్, శివకుమార్, బస్వా బాలసుబ్రమణ్యం, బెల్లం రమేష్, దేవదానం, సురేష్ రాయల్, జక్కా శరత్, పాముల రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page