SAKSHITHA NEWS

సాక్షిత :ఆరోగ్య‌శ్రీలో మ‌రో ముంద‌డుగు*
తండ్రిని మించిన పాల‌న‌తో జ‌గ‌న‌న్న స‌రికొత్త చ‌రిత్ర‌
*రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని *
రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఇక‌పై రూ.25ల‌క్ష‌ల విలువైన వైద్యాన్ని పూర్తి ఉచితంగా అందించేలా చ‌ర్య‌లు తీసుకోవ‌డం ద్వారా రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించార‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు.

గుంటూరు ప‌ట్ట‌ణం 49వ డివిజ‌న్‌లోని భార‌త్‌పేట లో మంత్రి మంగ‌ళ‌వారం ఆరోగ్య‌శ్రీ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. మంత్రి విడ‌ద‌ల ర‌జిని ముఖ్య అతిథిగా హాజ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్ర‌జ‌లకు మెరుగైన ఆరోగ్యం అందించేందుకు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎన్నో విప్ల‌వాత్మ‌క మార్పులు, సంస్క‌ర‌ణ‌ల‌ను వైద్య ఆరోగ్య‌శాఖ‌లో తీసుకొచ్చార‌ని కొనియాడారు. స్థానిక ఎమ్మెల్యే మ‌ద్దాళి గిరి , ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి , న‌గ‌ర మేయ‌ర్ కావ‌టి మ‌నోహ‌ర్‌నాయుడు , డిప్యూటీ మేయ‌ర్ షేక్ స‌జీల త‌దిత‌రులు పాల్గొన్నారు. ఆరోగ్య‌శ్రీ సీఈవో బాలాజీ , క‌లెక్ట‌ర్ వేణుగోపాల్‌రెడ్డి , క‌మిష‌న‌ర్ కీర్తి చేకూరి త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

WhatsApp Image 2023 12 19 at 7.02.15 PM

SAKSHITHA NEWS