డ్రంక్ అండ్ డ్రైవ్ వల్లనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు:ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్

SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 25 at 2.20.19 PM

జోగులాంబ గద్వాల:-

మద్యం సేవించి వాహనాలను నడపడం వల్ల అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, రోడ్డు ప్రమాదాలలో ప్రతిరోజు ఒకరు చనిపోవడం, కనీసం ముగ్గురు గాయలపాలై అంగవైకల్యం చెందుతున్నారని గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ కే. సృజన ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్ కార్యాలయంలో వివిధ మండల పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన 18 మందికి ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ మరియు రోడ్డు ప్రమాదాల వీడియోలను చూపించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ మాట్లాడుతూ…ఎక్కువ మోతాదులో మద్యం సేవిస్తే శిక్ష సైతం ఎక్కువగానే ఉంటుందని, ప్రమాదాలకు కారణమవుతున్న విషయాలపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ఈ కౌన్సిలింగ్ ప్రారంభించడం జరిగిందన్నారు.

మద్యం సేవించి వాహనాలు నడిపే వారి సంఖ్యను క్రమంగా తగ్గించడం, రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. జిల్లాలో రోజుకు ఒక వ్యక్తి చనిపోతున్నాడని, అలాగే రోజుకు ఇద్దరు రోడ్డు ప్రమాదాల వల్ల పూర్తిగా అంగవైకల్యానికి గురవుతున్నారని, దీని కారణంగా రోజుకు మూడు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం సేవించడం తప్పు కాదని, అదే సమయంలో మద్యం సేవించి వాహనాలు నడపడం నేరమని చెప్పారు.

మద్యం సేవింవి వాహనాలు నడపడం వల్ల చిన్న, చిన్న తప్పులకు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్పారు.అనంతరం మద్యం సేవించి వాహనాలు ఎట్టి పరిస్థితులలో నడపమని, హెల్మెట్, బెల్ట్ ధరించడం, మైనర్లకు వాహనాలు ఇవ్వమని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు.సరైన అవగాహన లేకపోవడం, చిన్న చిన్న తప్పుల కారణంగా పెద్ద సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న పరిస్థితిని అర్ధం చేసుకోవాలని, రోడ్డు ప్రమాదాలను నివారించడం ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబంది పాల్గొన్నారు.


SAKSHITHA NEWS

sakshitha

Related Posts

mla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు

SAKSHITHA NEWS

SAKSHITHA NEWSmla ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిని ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకులు సాక్షిత : మేడ్చల్ జిల్లా..మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను సమీక్షించేందుకు ఎక్కడికి వెళ్లినా కావాలనే ఒక వర్గం మల్కాజిగిరి ఎమ్మెల్యేను…


SAKSHITHA NEWS

collector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్

SAKSHITHA NEWS

SAKSHITHA NEWScollector జిల్లా పరిషత్ బాధ్యతలను స్వీకరించిన జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ *సాక్షిత వనపర్తి :జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ గడువు జులై 4తో ముగియడంతో నిబంధనల ప్రకారం జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ జిల్లా ప్రజా…


SAKSHITHA NEWS

You Missed

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

appeal అల్లూరి విగ్రహం తిరుపతిలో ప్రతిష్టించాలని విజ్ఞప్తి

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

alluri అల్లూరి జీవితం అందరికి ఆదర్శ ప్రాయం : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

tirupati మార్కెట్, పార్కింగ్ స్థలాలకు టెండర్లు స్వీకరణ : కమిషనర్ అదితిసింగ్ ఐఏఎస్

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

sri chakra శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

govt ప్రభుత్వ బాలికల పాఠశాలను హోం మంత్రి అనిత తనిఖీలు..

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

visakhapatnam విశాఖలో భారీ గంజాయి పెట్టివేత

You cannot copy content of this page