SAKSHITHA NEWS

చోధకులకు కౌన్సిలింగ్ ఇస్తున్న ట్రాఫిక్ ఎస్సై

గద్వాల:-డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడితే లైసెన్స్‌ తాత్కాలికంగా రద్దు అవుతుంద అని కేసు తీవ్రతను బట్టి శాశ్వతంగా కూడా రద్దు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఇకపై తాగి డ్రైవింగ్ చేయొద్దని గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ అన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలోని ట్రాఫిక్ ఇన్స్టిట్యూట్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ రీతురాజ్ ఆదేశాలమేరకు వివిధ మండలలా పరిధిలో మద్యం తాగి పట్టుబడిన 28 మందికి ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ విజయ్ భాస్కర్ మాట్లాడుతూ…మద్యం తాగి వాహనాలు నడిపి ఏదైనా ప్రమాదాలు జరిగితే కుటుంబాలు రోడ్డుపాలవుతాయన్నారు.

మద్యం తాగి వాహనం నడిపి యాక్సిడెంట్స్ అయిన సంఘటనలు ఎక్కువగానే ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పోలీసులకు పట్టుబడితే భవిష్యత్తులో చాలా కష్టాలు ఎదుర్కోవాలిసి వస్తుంది అని అయన అన్నారు. కోర్టులో ప్రతి కేసూ నమోదవుతుంది మరియు జైలుకు వెళ్తే ఉద్యోగాలు పోతాయి. విద్యార్థులు, యువకులకు ఉద్యోగాలకి, విదేశాలకి వెళ్లాల్సి వస్తే ఈ కేసులు అడ్డొస్తాయి అని అన్నారు.డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడితే లైసెన్స్‌ రద్దు చేస్తాం అన్నారు.రోడ్డు ప్రమాదాలను నివారించడం లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు, వాహనదారులు, ఆటో డ్రైవర్లు విధిగా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలు జరగకుండా తమతో సహకరించాలని ట్రాఫిక్ ఎస్సై అన్నారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 05 At 2.02.09 Pm

SAKSHITHA NEWS